Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ రాజమౌళి…ఆయన చేసిన సినిమాలన్ని అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సినిమాని సక్సెస్ ఫుల్ గా మార్చడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన రవితేజ తో ‘విక్రమార్కుడు’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా రవితేజ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. అటు కామెడీ, ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ లో రవితేజ తన సత్తా చాటాడు… ఇక రాజమౌళి సినిమాలన్నింటిలో రవితేజ కి నచ్చిన సినిమా ఏంటి అంటే తను చేసిన విక్రమార్కుడు సినిమా కాకుండా ఇంకేదైనా సినిమా పేరు చెప్పమంటే ఆయన మగధీర సినిమా పేరు చెప్పడం విశేషం…
గతంలో రవితేజ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. అలాగే తను చాలా హార్డ్ వర్కర్ అంటూ చెప్పాడు. మొత్తానికైతే రాజమౌళి సినిమాల్లో రవితేజకు నచ్చిన సినిమా మగధీర అని చెప్పడంతో మెగా అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి…ప్రస్తుతం తను ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి.
అలాగే యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునేలా చేశాయి… ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా సైతం ప్రేక్షకులందరిని మెప్పించడానికి రెడీ అవుతుంది…ఇక ఈ సినిమాను 2027 లో రిలీజ్ చేయడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు…