Dhamaka Collections: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు..ఎందుకంటే మొదటి రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ అలాంటిది మరి..ఆన్లైన్ లో రివ్యూస్ అన్నీ ఈ చిత్రానికి నెగటివ్ గానే వచ్చాయి..రవితేజ కి మరో ఫ్లాప్ అని అందరు అనుకున్నారు..కానీ అలా అనుకున్న వాళ్ళందరి అంచనాలను తలక్రిందులు చేసేసింది ఈ చిత్రం రన్..మొదటి రోజు నుండి నేటి వరకు ఈ సినిమా కోటి రూపాయలకు తగ్గకుండా ప్రతీ రోజు షేర్ వసూళ్లు సాధించింది అంటే మామూలు విషయం కాదు.

ఈ ఏడాది విడుదలైన స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ స్థాయి ట్రెండ్ ని చూపించలేదు..కేవలం ధమాకా కి మాత్రమే ఆ స్థాయి వసూళ్లు వచ్చాయి..దీనినిబట్టి ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇక 10 వ రోజు అనగా కొత్త సంవత్సరం నాడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతం సృష్టించింది.
ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రానికి 10 వ రోజు ఏకంగా 4 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..రాజమౌళి సినిమాల తర్వాత 10 వ రోజు ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ఇదే..#RRR చిత్రం 16 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టింది, ఆ తర్వాత బాహుబలి 2 చిత్రం 8 కోట్ల 55 లక్షల రూపాయిలు, బాహుబలి 1 చిత్రం 5 కోట్ల 45 లక్షల రూపాయిలను వసూలు చేసి రెండు మరియు మూడవ స్థానాల్లో కొనసాగుతున్నాయి..వీటి తర్వాత రవితేజ ‘ధమాకా’ చిత్రం నిలిచింది.

న్యూ ఇయర్ అవ్వడం వల్లే ఈ చిత్రానికి ఆ స్థాయి వసూళ్లు వచ్చాయని అంటున్నారు..గతం లో పుష్ప సినిమా కి న్యూ ఇయర్ రోజు దాదాపుగా రెండు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ధమాకా చిత్రం ఆ సినిమాకి డబుల్ వసూలు చెయ్యడం విశేషం..ఇప్పటి వరకు ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఫుల్ రన్ లో 40 కోట్లు వసూలు చేస్తుందో లేదో చూడాలి.