https://oktelugu.com/

Raviteja Vs Mahesh Babu: అప్పుడు చిరంజీవి X బాలకృష్ణ.. ఇప్పుడు రవితేజ వర్సెస్ మహేష్ బాబు.. ఎవరు గెలుస్తారో?

అంటే వచ్చే సంక్రాంతికి రవితేజ, మహేష్ మధ్య సినీ వార్ ఉండబోతుందన్నమాట. 2023 సంక్రాంతికి ఇద్దరు బిగ్ స్టార్ల సినిమాలు రిలీజై ఆ ఇయర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు 2024 సంక్రాంతి కూడా ఫ్యాన్స్ కు బూస్టు నిచ్చే సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2023 / 10:47 AM IST
    Follow us on

    Raviteja Vs Mahesh Babu: సిని ఇండస్ట్రీలోని స్టార్లంతా స్నేహాభావంతో ఉంటారు. ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిపోతుంటారు. సినిమా కార్యక్రమాల్లో, స్పెషల్ ఈవెంట్స్ లో కలుసుకొని కబుర్లు చెప్పుకుంటారు. అయితే సినిమా రిలీజ్ సమయానికి మాత్రం పోటీ పడుతుంటారు. కొన్ని ఫెస్టివల్స్, ప్రత్యేక రోజుల్లో సినిమాలను రిలీజ్ చేయడానికి ఉత్సాహ పడుతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. అలాంటి రోజు వచ్చినప్పుడు ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్ నడుస్తుంది. 2023 సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో ఒకే రోజు రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించారు. కానీ ఆ తరువాత ఒకరోజూ అటూ ఇటూ తేడాతో థియేటర్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 2024 సంక్రాంతికి మహేష్ సినిమాతో మాస్ మహారాజా పోటీ పడుతున్నాడు.. ఆ వివరాలేంటో చూద్దాం..

    హిట్టు ఫట్టుతో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా మారాడు. లేటేస్టుగా ఆయన నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత రవితేజ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. దీనికి ‘ఈగల్’ నే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే సినిమా తీసిని కార్తీక్ ఘట్టమనేని రవితేజతో బిగ్ ప్లాన్ వేస్తున్నాడు. దీనిని 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈసారి సంక్రాంతి బరిలో రవితేజ ఉన్నాడన్నమాట.

    మహష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో #SSMB28 మేకింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ముందుగా దీనిని ఆగస్టు 11న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాదని తేలింది. దీంతో దీనిని సంక్రాంతికి షిప్ట్ చేశారు. అంటే వచ్చే సంక్రాంతి బరిలో మహేష్ బాబు పోటీలో ఉంటాడని తెలుస్తోంది. హ్యట్రిక్ హిట్ల తరువాత మహేష్ చేస్తున్న ఈ మూవీపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పైగా త్రివిక్రమ్ -మహేష్ సినిమాలో ఎంతో కొంత పస ఉంటుందని ఆడియన్స్ నమ్మకం.

    రవితేజ టైగర్ నాగేశ్వర్ రావును ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో మహేష్ #SSMB28ని ఇదే డేట్ కు ఫిక్స్ చేశారు. ఇక మాస్ మహరాజ మరో మూవీ ‘ఈగల్’ను సంక్రాతికి రెడీ చేస్తుంటూ అప్పుడూ #SSMB28నే పోటీకి వస్తుంది. అంటే వచ్చే సంక్రాంతికి రవితేజ, మహేష్ మధ్య సినీ వార్ ఉండబోతుందన్నమాట. 2023 సంక్రాంతికి ఇద్దరు బిగ్ స్టార్ల సినిమాలు రిలీజై ఆ ఇయర్ ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు 2024 సంక్రాంతి కూడా ఫ్యాన్స్ కు బూస్టు నిచ్చే సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.