Ravi Teja And Kamal Haasan: సినీ ఇండస్ట్రీ లో వివక్ష ధోరణి ఈమధ్య కాలం లో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక హీరో చేస్తే కనిపించని తప్పు, మరో హీరో చేస్తే కనిపిస్తుంది. ఎక్కువగా ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే జరుగుతుంది. ఇతర ఇండస్ట్రీస్ కి సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తే మన తెలుగు ఆడియన్స్ అసలు ప్రశ్నించరు. ఉదాహరణకు మాస్ మహారాజ రవితేజ ని తీసుకుందాం. ఈయన వయస్సు 50 ఏళ్లకు పైమాటే. ఈయన శ్రీలీల(Sree Leela) లాంటి 23 ఏళ్ళ అమ్మాయితో కలిసి చిందులు వేసినా, చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించినా నీ వయస్సు ఏంటి?, ఆ అమ్మాయి వయస్సు ఏంటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఏకిపారేస్తూ ఉంటారు. గత ఏడాది విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు కూడా ఇలాంటి విమర్శలు తప్పలేదు. ఇందులో హీరోయిన్ గా నటించిన ‘భాగ్యశ్రీ భొర్సే'(Bhagyasri Bhorse) తో రవితేజ(Raviteja) రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మహాపాపం అన్నట్టు గా సోషల్ మీడియా లో నెటిజెన్స్ తిట్టారు.
హీరోయిన్ కి లేని బాధ మీకు ఎందుకు అని రవితేజ అభిమానులు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మిస్టర్ బచ్చన్ చిత్రం లో మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏమిటి అని భాగ్యశ్రీ ని అడగ్గా, ఆమె రవితేజ తో రొమాన్స్ చేయడం చాలా బాగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కంఫర్ట్ గా ఫీల్ అవ్వనప్పుడు ప్రశ్నించినా ఒక రకం, ఆమె తన ఇష్టం తో ఆ సినిమాని చేసింది, ఇక మీకు వచ్చిన నష్టమేంటి?, సినిమాని కేవలం సినిమా లాగానే చూడండి అంటూ రవితేజ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రవితేజ విషయం లో ఇంత రచ్చ చేసిన నెటిజెన్స్ కమల్ హాసన్ ని మాత్రం ఎందుకు ప్రశ్నించరు? అంటూ విశ్లేషకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న.
నిన్న కమల్ హాసన్(Kamal Hassan) హీరో గా నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో అభిరామి అనే హీరోయిన్ తో కమల్ హాసన్ లిప్ లాక్ సన్నివేశం చేసాడు, అదే విధంగా త్రిష తో కూడా ఆయన రొమాన్స్ చేసాడు. కమల్ హాసన్ వయస్సు 70 ఏళ్ళు. అంత వయస్సు ఉన్న మనిషి 40 ఏళ్ళ అమ్మాయికి లిప్ లాక్ ఇస్తే తప్పు లేదు కానీ, రవితేజ కుర్ర హీరోయిన్స్ తో చిన్నపాటి రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తే తప్పు అయిపోయిందా?, ఇలా లిప్ లాక్ సన్నివేశాల్లో రవితేజ నటించి ఉండుంటే నెటిజెన్స్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వచ్చి ఉండేవి?, ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా?, ఇది చాలా అన్యాయం అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద హీరోలు చేస్తే అసలు ఇలాంటివి పట్టించుకోరు, అదే రవితేజ లాంటి ఒక సాధారణ మనిషి, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇంత రేంజ్ కి ఎదిగిన మనిషిని మాత్రం టార్గెట్ చేస్తారు అంటూ విరుచుకుపడుతున్నారు రవితేజ ఫ్యాన్స్.