https://oktelugu.com/

హిట్ వస్తే ఇగోలు ఉండవ్.. క్రేజీ కాంబినేషన్ మళ్ళీ !

మాస్ మహారాజ్ రవితేజకు ‘పారితోషికం పిచ్చి’ అని కొంతమంది నిర్మాతాలు గతంలో కామెంట్స్ చేస్తే.. రవితేజ కూడా ఆ కామెంట్స్ పై సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు. అయితే అలాంటి కామెంట్స్ తన పై ఎన్నిసార్లు వస్తోన్నా.. రవితేజ మాత్రం మొదటి నుండి రెమ్యునరేషన్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి రవితేజతో చేయాలనుకున్నా సినిమా కూడా క్యాన్సల్ అయింది. Also Read: ‘దీపికా’ అసలు గ్యాప్ ఇచ్చేలా లేదు ! […]

Written By:
  • admin
  • , Updated On : March 8, 2021 / 05:11 PM IST
    Follow us on


    మాస్ మహారాజ్ రవితేజకు ‘పారితోషికం పిచ్చి’ అని కొంతమంది నిర్మాతాలు గతంలో కామెంట్స్ చేస్తే.. రవితేజ కూడా ఆ కామెంట్స్ పై సీరియస్ గానే రియాక్ట్ అయ్యాడు. అయితే అలాంటి కామెంట్స్ తన పై ఎన్నిసార్లు వస్తోన్నా.. రవితేజ మాత్రం మొదటి నుండి రెమ్యునరేషన్ పైనే ఎక్కువ మక్కువ చూపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి రవితేజతో చేయాలనుకున్నా సినిమా కూడా క్యాన్సల్ అయింది.

    Also Read: ‘దీపికా’ అసలు గ్యాప్ ఇచ్చేలా లేదు !

    రవితేజ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగాడనే మారుతి, బన్నీ వాసు, యూవీ వంశీ, అల్లు అరవింద్ టీం అతనితో చెయ్యాల్సిన సినిమాని గోపీచంద్ తో చేస్తున్నారు. నిజానికి క్రాక్ రిలీజ్ కి ముందువరకూ.. రవితేజ వరుసగా ఆరు ప్లాపులు ఇచ్చి కూడా అంత పారితోషికం ఎలా అడుగుతాడని బన్నీవాసు టీం మండిపడింది. కాస్త ఘాటుగానే వాళ్ళు అప్పుడు కామెంట్స్ చేశారు. ఇలా అయితే మరో నాలుగేళ్లల్లో కెరీర్ ముగుస్తోందని కూడా అన్నట్టు వార్తలు వచ్చాయి.

    అయితే రవితేజ మాత్రం తన సినిమాలకు మార్కెట్ ఉందనే అనేవాడు అట. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తానూ తగ్గేది లేదని, అవసరం అయితే సినిమాని కూడా వదులుకుంటానని.. మొత్తానికి మారుతి సినిమా వదులుకున్నాడు. దాంతో బన్నీవాసు టీమ్ రవితేజ సూపర్ హిట్ మూవీ వదులుకున్నాడని, ఇక భవిష్యత్తులో ఆయనకు మళ్ళీ ఇలాంటి కథ, ఇలాంటి హిట్ రాదని అన్నారు. కట్ చేస్తే.. క్రాక్ రిలీజ్ అయింది. రవితేజ మళ్ళీ బౌన్స్ అయ్యాడు.

    Also Read: ప్రభాస్ కి బాధ చెప్పుకున్న హాట్ బ్యూటీ !

    తీరా కలెక్షన్స్ చూస్తే.. రవితేజ మార్కెట్ రేంజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదని రుజువు అయింది. మంచి మాస్ సినిమా తనకి పడితే… ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు పెడతారని.. రవితేజ క్రాక్ తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. మొత్తానికి రవితేజ వర్సెస్ అల్లు-మారుతి పోటీలో రవితేజ తన రేంజ్ ఏమిటో చూపించాడు. ఇప్పుడు మళ్ళీ మారుతి రవితేజకు ఒక కథ చెప్పాడు. అన్నట్టు ఈ సినిమాని నిర్మించేది కూడా బన్నీవాసు టీమ్ నే. హిట్ వస్తే.. ఇగోలు ఉండవ్ అని నిరూపించారు వీళ్ళు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్