https://oktelugu.com/

Raveena Tandon: పార్టీలో రచ్చ.. కేకలు పెట్టిన సీనియర్ హీరోయిన్ !

Raveena Tandon: వాడిపోయిన పువ్వు మళ్లీ వికసించినట్లు.. ప్రస్తుతం ఫేడ్ హీరోయిన్ ‘రవీనా టాండన్’ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. “కేజీఎఫ్ 2” ఇచ్చిన జోష్ లో వరుస పార్టీలు ఇస్తూ చిందులు వేస్తోంది. గత నాలుగేళ్ల నుంచి సరైన ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా.. ఆమెకు చెప్పుకోతగ్గ ఛాన్స్ రాలేదు. విసిగి వేసారి పోయి సీరియల్ కి కూడా కమిట్ అయ్యింది. అప్పుడే ఆమె తలుపు తట్టాడు ప్రశాంత్ నీల్. వచ్చిన అదృష్టాన్ని ఒడిసి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 11:29 AM IST
    Follow us on

    Raveena Tandon: వాడిపోయిన పువ్వు మళ్లీ వికసించినట్లు.. ప్రస్తుతం ఫేడ్ హీరోయిన్ ‘రవీనా టాండన్’ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. “కేజీఎఫ్ 2” ఇచ్చిన జోష్ లో వరుస పార్టీలు ఇస్తూ చిందులు వేస్తోంది. గత నాలుగేళ్ల నుంచి సరైన ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా.. ఆమెకు చెప్పుకోతగ్గ ఛాన్స్ రాలేదు. విసిగి వేసారి పోయి సీరియల్ కి కూడా కమిట్ అయ్యింది.

    Raveena Tandon

    అప్పుడే ఆమె తలుపు తట్టాడు ప్రశాంత్ నీల్. వచ్చిన అదృష్టాన్ని ఒడిసి పట్టుకోవడంలో ముప్పై ఏళ్ల అనుభవం అయ్యే. ఆ అనుభవంతో రవీనా టాండన్ “కేజీఎఫ్ 2”ను బాగా ఉపయోగించుకుంది. సినిమాలో చేసింది చిన్న క్యారెక్టర్ అయినా.. వెరీ పవర్ ఫుల్ క్యారెక్టర్. దాంతో ఒక్కసారిగా ఆమెకు డబుల్ క్రేజ్ వచ్చింది. నిజానికి నిన్నటి తరంలో రవీనాకి ఫుల్ క్రేజ్ ఉండేది.

    కానీ, నేటి తరానికి ఆమె పెద్దగా తెలియదు. ఇప్పుడు దేశమంతా ఆమె పేరు మార్మోగుతోంది. డిజిటల్ పీపుల్ కి కూడా రవీనా టాండన్ చేరువైంది. ఇక నుంచి ఆమెకు పవర్ ఫుల్ క్యారెక్టర్లు వస్తాయి అనడంలో సందేహం లేదు. పైగా ఇప్పటికే దర్శక, నిర్మాతలు రవీనా టాండన్ డేట్లు కోసం ఎగబడుతున్నారు.

    Also Read: Rajamouli Eega Movie: ఆయ‌న మీద కోపంతోనే జ‌క్క‌న్న ఈగ మూవీని తీశాడంట‌..!

    ఆమె పై సోలో సినిమాలు చేయడానికి కూడా కొంతమంది ప్లాన్ చేస్తున్నారు. మొత్తమ్మీద రాలిపోయి ఎండిపోయాక, చిగురు మెలిచినట్టు… తన కెరీర్ కి మళ్ళీ ఊపు రావడంతో రవీనా టాండన్ వరుసగా పార్టీలు ఇస్తూ రచ్చ చేస్తోంది. ఐతే తాజాగా, రవీనా టాండన్ మిత్రురాలు, హైదరాబాద్ కి చెందిన పేజ్ 3 సెలెబ్రిటీ పింకీ రెడ్డి కూడా పెద్ద పార్టీ ఇచ్చింది.

    Raveena Tandon

    ఈ పార్టీలో రవీనా టాండన్ మరియి ఆమె స్నేహ బృందం ఫుల్లుగా డ్యాన్స్ చేస్తూ.. అరుపులు కేకలతో హుల్లాసంగా ఊగిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ఓ లుక్కేసి ఆనందించండి.

    Recommended Videos:

    Tags