Pallavi Prashanth Parents: కామనర్ కోటాలో బిగ్ బాస్ తెలుగు 7లో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఇతడు ఫేమస్ అయ్యాడు. రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసేవాడు. తన వీడియోల్లో బిగ్ బాస్ కి వెళ్లాలన్న కోరిక బయటపెట్టాడు. అందుకు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఎందరో కలలు కనే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ వీక్ నామినేషన్ లో నిలిచిన పల్లవి ప్రశాంత్ రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకున్నాడు. జనాలు మనోడికి గుద్దుతున్నారు. 8 మంది నామినేషన్స్ లో ఉండగా పల్లవి ప్రశాంత్ ఒక్కడికే 40% ఓట్లు పడ్డట్లు సమాచారం.
ఇక సెకండ్ వీక్ నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని దాదాపు హౌస్ మొత్తం టార్గెట్ చేసింది. రైతుబిడ్డ అయితే ఏంటి? అందరూ కష్టపడుతున్నారని పల్లవి ప్రశాంత్ పై విరుచుకుపడ్డారు. అమర్ దీప్ చౌదరి, రతికా రోజ్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ఏరా పోరా అంటూ తూలనాడారు. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు కీలక ఆరోపణలు చేశారు.
తన కొడుకును అమర్ దీప్ చౌదరి ఏరా పోరా అని గౌరవం లేకుండా మాట్లాడటం బాధ కలిగించింది అన్నారు. రైతుబిడ్డ అనే కారణంతో తక్కువగా చూస్తున్నారు. నాకు అదుండి, ఇదుందని విర్రవీగుతున్నారు. అది సరికాదు. బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే. రతికా రోజ్ మా అబ్బాయిని వాడుకుంది. అతనితో ఉంటే తనకు కూడా ఓట్లు పడతాయని అనుకుంది. పల్లవి ప్రశాంత్ అందరినీ అక్కా చెల్లి అంటున్నాడు. అతనికి దురుద్దేశం ఉండదు.
గతంలో రూ. 7 లక్షల రూపాయలు అతని ఫ్రెండ్ మోసం చేసి కాజేశారు. అప్పుడు చనిపోతా అన్నాడు. నీకు నేను ఉన్నాను. ఏది అడిగినా కొనిస్తా అన్నాను. రీల్స్ చేస్తా సెల్ ఫోన్ కావాలి అన్నాడు. కొనిచ్చాను. అలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు చాలా కష్టపడ్డాడు. షోకి వెళ్లడం, నాగార్జునను కలవడం మాకు ఆనందం పంచింది. షో నుండి బయటకు వచ్చాక పల్లవి ప్రశాంత్ కి పెళ్లి చేస్తామని పేరెంట్స్ చెప్పుకొచ్చారు.