https://oktelugu.com/

Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేషన్… పల్లవి ప్రశాంత్ చేసిన దానికి అందరూ షాక్!

ముఖ్యంగా ప్రశాంత్ విషయంలో రతిక చేసిన రచ్చ అంత ఇంత కాదు . పవర్ అస్త్ర టాస్క్ లో అయితే ఏకంగా హద్దులు మీరి మాట్లాడింది . అమరదీప్ తో కలిసి అతి వేషాలు వేసింది .

Written By:
  • Shiva
  • , Updated On : October 2, 2023 / 03:40 PM IST
    Follow us on

    Rathika Rose: బిగ్ బాస్ 7 రతిక రోజ్ నాలుగో వారం ఎలిమినేటై తట్టాబుట్టా సర్దుకుని ఇంటి బాట పట్టింది . ఈమె ను మొదట్లో ఆడియన్స్ బాగా ఆదరించారు . పల్లవి ప్రశాంత్ తో నడిపిన ట్రాక్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు .మల్లి ప్రిన్స్ కి అన్వర్ అని పేరు పెట్టి ప్రేమాయణం సాగించింది రతిక . వారిద్దరితో మంచిగా ఉంటూనే ,అవకాశం రాగానే ప్లేట్ తిప్పేసింది రతిక. అసలు ఏ కారణం లేకుండా వాళ్లకు వ్యతిరేకంగా మారిపోయింది.

    ముఖ్యంగా ప్రశాంత్ విషయంలో రతిక చేసిన రచ్చ అంత ఇంత కాదు . పవర్ అస్త్ర టాస్క్ లో అయితే ఏకంగా హద్దులు మీరి మాట్లాడింది . అమరదీప్ తో కలిసి అతి వేషాలు వేసింది . దీనిని వీకెండ్ లో నాగార్జున కూడా ఖండించారు. శివాజీ విషయంలో కూడా రతిక కావాలని గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది . రతిక చేసిన చిన్న చిన్న తప్పులు ,ఆమెను ఎలిమినేషన్ వరకు తీసుకొచ్చాయి.

    రతిక ఎలిమినేట్ అయినందుకు కంటెస్టెంట్స్ పెద్దగా బాధపడలేదు . ఎవరు ఎమోషనల్ అయినట్టు కనిపించలేదు . గతంలో కిరణ్ రాథోడ్ ,షకీలా ,దామిని ఎలిమినేట్ అయినప్పుడు కంటెస్టెంట్స్ చాలా బాధ పడ్డారు ,కానీ రతిక విషయంలో ఎవరు అంత ఫీల్ అయినట్టు కనిపించలేదు . ఏదో ఫార్మాలిటీ కోసం బాధపడినట్లు అనిపించింది . ఇది ఇలా ఉంటే రతిక ఎలిమినేట్ అయినందుకు అందరికంటే ఎక్కువ బాధ పడతాడు అనుకున్న ప్రశాంత్ అసలు ఆమెను పట్టించుకోలేదు .

    దూరం దూరంగా ఉంటూ చూస్తూ ఉండిపోయాడు. రతికతో అసలు ఏమి మాట్లాడలేదు . రతిక కూడా ప్రశాంత్ ని చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. ప్రశాంత్ ఇలా చేయడానికి కారణం ఏంటో అందరికీ తెలుసు . ప్రశాంత్ అలా ఉండటం లో ఆశ్చర్యం ఏమీ లేదు .రతిక ఎలిమినేషన్ అయినందుకు ప్రశాంత్ ఏ మాత్రం లెక్క చేయలేదు . రతికా కూడా సీరియల్ బ్యాచ్ అందరితో మాట్లాడి ,శివాజీ బ్యాచ్ ని చూసి చూడనట్టు వెళ్ళిపోయింది.