https://oktelugu.com/

Bhagavanth Kesari : భగవంత్ కేసరి లో రతిక రోజ్ రెమ్యూనరేషన్… ఐదు నిమిషాల పాత్రకు అన్ని లక్షలా!

ఈ సారి ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, హౌస్ లో అందరితో ఎలా నడుచుకుంటుందో చూడాలి మరి.

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2023 / 07:01 PM IST
    Follow us on

    Rathika Rose – Bhagavanth Kesari : బిగ్ బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె బిగ్ బాస్ అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తన అందంతో అందరినీ కట్టి పడేసింది.ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపింది. తన చుట్టూ తిప్పుకుంది. చేసిందంతా చేసి తీరా ప్లేట్ తిప్పేసి ప్రశాంత్ కు వ్యతిరేకంగా మారిపోయింది. అనరాని మాటలు అని ప్రశాంత్ ని ఘోరంగా అవమానించింది రతిక. దీంతో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది.సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ కు గురైంది.

    టాప్ 5 లో ఉంటుంది అనుకున్న రతిక నాలుగో వారంలో ఎలిమినేట్ అయ్యి షాక్ ఇచ్చింది. ఆమె ఎలిమినేట్ అయినప్పటికీ సోషల్ మీడియాలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. మళ్ళీ రతిక ఈ రోజు హౌస్ లో అడుగుపెట్టనుంది.ఇది పక్కన పెడితే రతిక ఇటీవల ఒక సినిమాలో కనిపించింది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి లో చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో రతిక మంత్రి పాత్రలో ఐదు నిమిషాలు పాటు కనిపించింది.

    భగవంత్ కేసరి సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఐదు నిమిషాల పాత్ర కోసం ఐదు లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలో రతిక కనిపించడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

    రతిక హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కానీ అవకాశాలు లేక సైడ్ క్యారెక్టర్స్ తో సర్ది పెట్టుకుంది.అంతకు ముందు కొన్ని చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుందట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇక ఈ రోజు రతిక బిగ్ బాస్ హౌస్ లో కి ఎంట్రీ ఇస్తుంది. ఈ సారి ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, హౌస్ లో అందరితో ఎలా నడుచుకుంటుందో చూడాలి మరి.