Rasi Khanna : కెరీర్ బిగినింగ్ నుండి రాశి ఖన్నాది ఒడిదుడుకుల ప్రయాణమే. నిలకడగా కొంత కాలం సాగింది లేదు. స్టార్ హీరోయిన్ హోదా ఆమెకు దక్కలేదు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఫస్ట్ హిట్ అందుకున్న రాశికి జిల్, సుప్రీమ్ లాంటి చిత్రాలు కొంత ఫేమ్ తెచ్చాయి. టైర్ టూ హీరోలతో సినిమాలు చేసుకుంటున్న ఆమెకు దర్శకుడు బాబీ.. ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు. జై లవ కుశ మూవీలో రాశి మెయిన్ హీరోయిన్ గా చేసింది. నివేదా థామస్ మరో హీరోయిన్ గా నటించారు.

జై లవకుశ హిట్ కొట్టినప్పటికీ రాశికి స్టార్ హీరోలతో ఛాన్సులు రాకపోవడం దురదృష్టం. సక్సెస్ రేటు నిలకడగా లేకపోవడం కూడా దీనికి కారణం. తొలిప్రేమతో హిట్ అందుకున్న రాశి ఖన్నాకు శ్రీనివాస కళ్యాణం రూపంలో అట్టర్ ప్లాప్ పడింది. అయితే రాశి కెరీర్లో 2019 బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది ఆమెకు రెండు హిట్స్ పడ్డాయి.
సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించిన ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ కొట్టింది. దాదాపు రూ. 34 కోట్ల షేర్ రాబట్టిన ప్రతిరోజూ పండగే సాయి ధరమ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఏంజెల్ ఆర్నా పాత్రలో రాశి అద్భుతం చేసింది. అలాగే వెంకీ మామ రూపంలో మరో హిట్ అందుకుంది. వెంకీ-నాగ చైతన్యల ఈ మల్టీస్టారర్ డీసెంట్ హిట్ గా నిలిచింది.

అయితే వరల్డ్ ఫేమస్ లవర్ రెండు హిట్ చిత్రాలతో వచ్చిన ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఎక్కడికో వెళ్ళిపోదామని రాశి బోల్డ్ రోల్ చేసింది. సినిమా ఫలితం దెబ్బేయడంతో కెరీర్ కూడా తిరోగమనానికి గురైంది. ఆ దెబ్బతో టాలీవుడ్ కి దూరమై కోలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ఇక 2022 రాశి ఖన్నాకు అసలు కలిసి రాలేదు. ఆమె నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ డిజాస్టర్ అయ్యాయి. తెలుగులో ఆమెకు దాదాపు అవకాశాలు కనుమరుగయ్యాయి.

రాశి చేతిలో ప్రస్తుతం యోధ అనే బాలీవుడ్ మూవీ ఉంది. అలాగే ఒక హిందీ సిరీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రాశి గ్లామర్ నే నమ్ముకుంది. హాట్ ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ రోల్స్ కుడా సిద్ధం అంటూ హింట్ ఇస్తుంది. మరి రాశి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. యోధ విజయం సాధిస్తే కనీసం బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు.