కన్నడ హుడిగి రష్మిక మందన్నఅదృష్టానికి పర్యాయపదం లా మారింది. వరుస విజయాలతో చాలా సునాయాసం గా అందలం ఎక్కింది. తెలుగులో చేసింది కేవలం ఆరు చిత్రాలు. అయినా అగ్రపథానికి చాలా దగ్గర్లో ఉంది. రష్మిక మందన్న చేసిన ఆరు చిత్రాల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ , రెండు చిత్రాలు సూపర్ హిట్ , రెండు చిత్రాలు జస్ట్ యావరేజ్. తారలకు ఇలాంటి సక్సెస్ రేట్ చాలా అరుదుగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అప్పుడే మహేష్ బాబు , నాగార్జున, నాని , నితిన్ ,విజయ్ దేవరకొండ, నాగ శౌర్య వంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసింది. అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించు కొంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం తెలుగులో ఒక ల్యాండ్ మార్క్ చిత్రం గా రూపొంద నుంది. ఈ చిత్రం కూడా సక్సెస్ సాధిస్తే రష్మిక మందన్నకి తెలుగులో దాదాపు అగ్రపీఠం దక్కినట్టే … ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్వరలో మరో హై రేటెడ్ మూవీ చేయబోతోంది .
తెలుగు టాప్ డైరెక్టర్ లలో ఒకరైన కొరటాల శివ భారీ ఎత్తున, ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న ” ఆచార్య” చిత్రం లో చెర్రీ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. మెగా స్టార్ నటించే 152 వ చిత్రం గా రూపొందుతున్న “ఆచార్య ” చిత్రం లో రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించ నుండగా అతని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఆలయాల నేపధ్యం లో అరుదైన కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మాణం అయ్యే ” ఆచార్య ” చిత్రం రష్మిక మందన్న కి తన సినీ ప్రయాణం లో ఒక మైలు రాయిగా నిలుస్తుంది అందులో సందేహం అక్కర లేదు.
Luck is like a rain comes all of sudden