Pushpa 2 Rashmika : సౌత్ ఇండియా లో అత్యధిక పారితోషికం తీసుకుంటూ మంచి డిమాండ్ మీద కొనసాగుతున్న స్టార్ హీరోయిన్స్ ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ఒకటి రష్మిక మండన..ఛలో సినిమా తో ఇండస్ట్రీ కి అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత గీత గోవిందం సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారింది..ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సూపర్ హిట్ సాధించినవే అవ్వడం విశేషం..నిర్మాతల పాలిట గోల్డెన్ లెగ్ గా మారింది.

2021 వ సంవత్సరం లో విడుదలైన పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న ఈమె త్వరలోనే పుష్ప 2 సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది..పుష్ప సినిమా వల్ల ఈమెకి బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ బాగా వస్తున్నాయి..ప్రస్తుతం ఈమె రణబీర్ కపూర్ తో ‘ఎనిమల్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. దీనితో పాటు సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి ‘మిషన్ మజ్ను’ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.
ఇక ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన ‘వారిసు’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..తెలుగు లో కూడా ఈ చిత్రం ‘వారసుడు’ పేరు తో రేపే విడుదల కావాల్సింది..కానీ దిల్ రాజు చివరి నిమిషం లో ఈ చిత్రాన్ని జనవరి 14 వ తేదికి వాయిదా వేసాడు..ఇక తమిళ వెర్షన్ రేపే విడుదల అవ్వబోతుండడం వల్ల హీరోయిన్ రష్మిక ఈ చిత్రం ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది.
ఈ సందర్భంగా మీడియా కి చెందిన ఒక వ్యక్తి రష్మిక ని ఒక ప్రశ్న అడుగుతూ ‘చాలా కాలం నుండి మీరు పుష్ప పార్ట్ 2 నుండి తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..నిజమేనా’ అని అడగగా రష్మిక దానికి సమాధానం చెప్తూ ‘అవునా..నాకు తెలీదు ఈ విషయం’ అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది..ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నాకు పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ని ఇచ్చిన సినిమా సీక్వెల్ ని నేను ఎందుకు వదులుకుంటాను.. సోషల్ మీడియా లో వచ్చే ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి’ అంటూ సమాధానం ఇచ్చింది.