
Rashmika Mandanna: రష్మిక మందాన సూపర్ స్ట్రాంగ్ ఉమన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కన్నడ భామ ఎవరికీ భయపడదు. మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఈ తత్వమే ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కన్నడ పరిశ్రమతో రష్మిక మందానకు పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలాంటిదేమీ లేదని రష్మిక చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది. పరిస్థితులు మాత్రం చాలా వేడిగా ఉన్నాయి. ముఖ్యంగా దర్శక హీరో రిషబ్ శెట్టి ఆమె మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయనతో రష్మిక మందానకు కోల్డ్ వార్ జరుగుతుంది. కాంతార చిత్రాన్ని ఉద్దేశిస్తూ రష్మిక చేసిన కామెంట్స్ ఆయన్ని బాగా హర్ట్ చేశాయి.
విచిత్రం ఏమిటంటే రష్మికకు హీరోయిన్ గా మొదట అవకాశం ఇచ్చింది రిషబ్ శెట్టినే. మరోవైపు ఆమెను ఎఫైర్ రూమర్స్ వెంటాడుతున్నాయి. విజయ్ దేవరకొండను ఆమె ప్రేమిస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. రెండు పర్యాయాలు విజయ్ దేవరకొండ-రష్మిక మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఇటీవల ఈ విషయాన్ని రష్మిక ఒప్పుకుంది కూడాను. విజయ్ దేవరకొండతో పాటు వెకేషన్ కి వెళ్తే తప్పేంటి. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్ తో టూర్ కి వెళ్తే ఎఫైర్స్ అంటగడతారా… అని పరోక్షంగా ఆమె ప్రశ్నిస్తున్నారు.
తాజాగా ఆమె దుబాయ్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రులతో పాటు దుబాయ్ వెళ్లారు. ఈ ఫ్యామిలీ టూర్ లో రష్మిక మందాన కూడా జాయిన్ అయ్యారు. దీన్ని ధృవీకరిస్తూ ఓ ఫోటో బయటకు వచ్చింది. ఎలాంటి సంబంధం లేకపోయితే ఫ్యామిలీ టూర్ లో రష్మిక జాయిన్ కావడమేంటని నెటిజన్స్ ఆమె ప్రశ్నిస్తున్నారు. చేసేవన్నీ చేస్తూనే మేము లవర్స్ కామంటున్నారు. అదే జనాలను కన్ఫ్యూజ్ చేస్తుంది.

అయితే ఈ నెగిటివిటీ, పుకార్లు, పరాజయాలు అన్నీ పక్కన పెట్టేసి లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి అంటుంది రష్మిక మందాన. ఓ గ్లామరస్ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మిక జీవితం చాలా చిన్నది, నెగిటివిటీ పట్టించుకోకుండా ఆస్వాదించండి అంటూ కామెంట్ పెట్టింది. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోనని ఆమె చెప్పకనే చెప్పారు. రష్మిక షేర్ చేసిన ఫోటో కూడా దుబాయ్ లో దిగిందే అని సమాచారం. ఇక రష్మిక కెరీర్ పరిశీలిస్తే… పుష్ప 2, యానిమల్ వంటి భారీ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
View this post on Instagram