Rashmika Mandanna Sister: తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయిక రష్మిక. ఆమె ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. దీంతో తెలుగు సినిమాల్లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది. అందరు స్టార్ హీరోలతో జతకడుతూ తనకెదురు లేదని నిరూపిస్తోంది. అందంతోనే కాదు నటనతో కూడా సమాధానాలు చెబుతోంది. అందుకే అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ధీంతో ఆమెకు ఎదురే లేకుండా పోతోంది. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ ప్రత్యేకమైన స్టైల్ లో ముందుకెళ్తోంది.

కథల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. అన్ని కథలు విన్నా నచ్చిన కథకే ఓకే చెబుతూ పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఇప్పుడు స్టార్ హీరోలందరు ఆమెతో చేయడానికే ఇష్టడుతున్నారు. దీంతో ఆమె రేంజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. వరుసగా అవకాశాలు వస్తున్నా సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది.
Also Read: Sarkaru Vaari Paata Collections: ‘సర్కారు’ 8 రోజుల కలెక్షన్స్.. సెకండ్ వీకెండ్ బ్యాడే
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ తెలుగులో రెండు, తమిళంలో ఒకటి, హిందీలో మూడు సినిమాలు చేస్తోంది. పుష్పతో క్రేజీ సంపాదించుకున్న ఈ అందాల రాశి ప్రస్తుతం తెలుగులో నెంబర్ వన్ స్థానం దక్కించుకుందనడంలో సందేహం లేదు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనతికాలంలో ఈ కన్నడ భామ అందివచ్చిన అవకాశాలతో అంచెలంచెలుగా ఎదిగింది. పాపులర్ హీరోయిన్ గా మారిపోయింది.
తాజాగా రష్మిక తన కుటుంబ సభ్యుల ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. రష్మికకు ఇంత చిన్న చెల్లెలు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రేక్షకులకు కనువిందు చేసే రష్మిక ఈ సారి మాత్రం తన ఫ్యామిలీ ఫొటో పెట్టడంతో షాక్ కు గురయ్యారు. మొత్తానికి రష్మిక నెటిజన్లకు ఏం సమాధానం చెబుతోందో చూడాలి. ఎప్పుడు కూడా తన ఫ్యామిలీ విషయాలు పంచుకోని ఆమె ప్రస్తుతం ఈ ఫొటో పెట్టడంపై అందరిలో సంశయాలు వస్తున్నాయి.

అందాల ముద్దుగుమ్మ రష్మికకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమె పెట్టే ఫొటో, పిక్ లకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు చురుకుగానే ఉంటారు. తన విషయాలను వారితో పంచుకునేందుకు ఇష్టపడతారు. అందుకే నెటిజన్లు కూడా ఎక్కువగా ఆమె అంటే ఆరాధిస్తున్నారు. తమకు ఇష్టమైన నాయికగా అభివర్ణిస్తున్నారు. దీంతో ఆమె అభిమానుల గుండెల్లో కూడా నిద్ర పోతోందని తెలుస్తోంది. రష్మికకు ఇంత చిన్న చెల్లెలు ఉందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. రష్మిక కు ఆమె చెల్లెలుకు వయసులో తేడా ఉంది. అందుకే అభిమానుల్లో ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read:Captain Chalapati Choudhary : ఎన్టీఆర్ పై అభిమానం.. నూతన్ ప్రసాద్ తో సాన్నిహిత్యం !
Recommended Videos



[…] […]