Rashmika Mandanna: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టార్రర్ #RRR ఓపెనింగ్ వసూళ్లను కూడా దాటేసిందంటే ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. మూవీ టీం మొత్తం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగి తేలుతుంది. రెండవ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు వంటి ప్రాంతాల్లో మన తెలుగు సినిమాలకు ఆశించిన స్థాయి ఓపెనింగ్ వసూళ్లు రావు. ఎందుకంటే అక్కడి ఆడియన్స్ కి ఎందుకో తెలుగు సినిమాలంటే చిన్న చూపు. కానీ పుష్ప చిత్రం అందుకు మినహాయింపుగా నిల్చింది. తమిళ ఆడియన్స్ కి అల్లు అర్జున్ బాగా దగ్గరయ్యాడు అని ఈ సినిమా ఓపెనింగ్స్ ని చూసిన తర్వాతనే అర్థమైంది.
అక్కడి ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి, రెండవ రోజు 50 కోట్ల రూపాయలకు మించి గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కలు చూస్తుంటే తలపండిన ట్రేడ్ పండితులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే నిన్న సెలెబ్రిటీలు కూడా ఈ సినిమాకి క్యూలు కట్టారు. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన నిన్న తన ప్రియుడు విజయ్ దేవరకొండ కుటుంబం తో కలిసి AMB మాల్ లో ప్రత్యక్షమయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ కి మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కుటుంబమే. ఆయన తండ్రి అల్లు అరవింద్ నిర్మించిన ‘గీత గోవిందం’ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడం, ఆ తర్వాత ఆయనకి యూత్ లో మంచి క్రేజ్ రావడం వంటివి జరిగింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి అల్లు ఫ్యామిలీ తో మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ, ‘పుష్ప 2’ విడుదలకు ముందు అల్లు అర్జున్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ రౌడీ టీ షర్ట్ ని పంపాడు. దీనిని అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించిన ఈ ఇద్దరు ఇలా స్నేహంగా ఉండడం చూసే అభిమానులకు చాలా బాగా అనిపిస్తుంది.
@iamRashmika graced the screening of #Pushpa2TheRule at AMB Cinemas, Sarath City Capital Mall, and she absolutely lit up the event with her charm and elegance! ✨#AlluArjun#RashmikaMandanna pic.twitter.com/SV51CDaEsI
— Virosh trends (@rowdyrashmika) December 5, 2024