Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’కి బాలీవుడ్ లో రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లోకి టాప్ హీరోయిన్ గా దూసుకువచ్చేసిన ఈ బ్యూటీకి, అటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ క్రష్ అనే బిరుదుతో తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతూ ముందుకు పోతుంది.

మొత్తానికి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ భారీ విజయంతో వచ్చిన జోరు కూడా ఈ కన్నడ భామకి బాగా కలిసి వచ్చింది. పైగా రష్మిక అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలు తన అందం కోసం రోజూ రష్మిక ఏం తింటుంది ? ఐతే, తాజాగా తన డైట్ ప్లాన్ గురించి చెప్పింది ఈ బ్యూటీ. అసలు షూటింగ్ లో నేను ఏం తింటానంటే.. అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.
Also Read: Anushka Shetty: మళ్లీ వైరల్ అవుతోన్న అనుష్క పెళ్లి పుకారు.. వరుడు అతనే !
ఈ వీడియోలో రష్మిక మొదట కోల్డ్ కాఫీ, సెలరీ జ్యూస్‌ని తాగింది. తర్వాత భోజనం బాదం వెన్నతో కూడిన ఓట్స్, సాయంత్రం టీ తాగింది. రాత్రి భోజనంలో చికెన్, బంగాళదుంపలను తీసుకుంది. ఇక ఇప్పటికే రష్మిక బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’ చిత్రంలోనూ అలాగే అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘గుడ్ బై’ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.

‘మిషన్ మజ్ను’ ఆల్ రెడీ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రెండో సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. అలాగే రష్మికకు మాత్రం మరో బాలీవుడ్ సినిమా చేయమని ఆఫర్ వచ్చిందట. తాజాగా అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో మూడో సినిమా ఒప్పుకున్నట్లు హింట్ ఇచ్చింది రష్మిక. అయితే ఆమె చేస్తోన్న మూడో సినిమాలో హీరో ఎవరు, దర్శకుడు ఎవరు లాంటి సినిమా డీటెయిల్స్ గురించి ఏమి వెల్లడించలేదు.
ఇంతకీ రష్మికకు వస్తోన్న హిందీ అవకాశాలు వెనుక ఉన్న కారణం సౌత్ మార్కెట్. రష్మికను తమ సినిమాలో పెట్టుకుంటే.. సౌత్ నుండి మార్కెట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. మొత్తానికి ఇటు తమిళంలో కూడా మొదటి ఆప్షన్ రష్మికనే కావడం విశేషం.
Also Read:Kangana Ranaut: స్టార్ హీరోలను అందుకే రిజెక్ట్ చేసిందట !
Recommended Videos: