https://oktelugu.com/

Rashmika Mandanna : రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్.. తొలగించాలని పోలీసులకు నటి ఫిర్యాదు.. ఐటీశాఖ సీరియస్

ఇక రష్మిక ఫేక్ వీడియోపై ఐటీశాఖ సీరియస్ అయ్యింది. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి చంద్రశేఖర్ మార్ఫింగ్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 06:58 PM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna : రష్మిక మందాన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బోల్డ్ గా ఉన్న ఆ వీడియో రష్మికదే అని నమ్మిన నెటిజెన్స్ ఆమెపై దుమ్మెత్తిపోశారు. విమర్శలు గుప్పించారు. అయితే అది డీప్ ఫేక్ వీడియో అని ఒక జర్నలిస్ట్ బహిర్గతం చేశాడు. రష్మిక వీడియోగా వైరల్ అవుతున్న ఫేక్ వీడియో కి సంబంధించిన ఒరిజినల్ వీడియో బయటపెట్టాడు. ఈ డీప్ ఫేక్ వీడియోస్ చాలా ప్రమాదకరం. వీటిని కట్టడి చేసేలా సవరణలు చేయాలి. కఠిన చట్టాలు చేయాలంటూ ట్వీట్ చేశాడు. జర్నలిస్ట్ ట్వీట్ ని అమితాబ్ కోట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    అవును ఇది సీరియస్ కేసు, ప్రభుత్వాలు దృష్టి సారించాలని ఆయన కామెంట్ చేశారు. దీంతో రష్మిక ఫేక్ వీడియోకి సంబంధించిన న్యూస్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో రష్మిక మందాన స్పందించారు.. ‘ఇలాంటి పరిణామం పై స్పందించడం బాధాకరం. నాతో పాటు అందరూ భయపడే అంశం. సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం అవుతుంది.

    నటిగా, మహిళగా నాకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, వెల్ విషర్స్ మద్దతుగా ఉన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియో నా స్కూల్, కాలేజ్ డేస్ లో వైరల్ అయితే నేను ఎదుర్కోగలనా. ఫేక్ డీప్ వీడియోలపై మనం ఒక సమూహంగా పోరాటం చేయాలి…’ అని ఆమె ట్వీట్ చేశారు. రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి కూడా స్పందించారు. బ్రిటన్ కి చెందిన జరా పటేల్ అని యువతి వీడియో అది. ఆమె అక్టోబర్ 9న తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దాన్ని డీప్ ఫేక్ చేశారు.

    ఇక రష్మిక ఫేక్ వీడియోపై ఐటీశాఖ సీరియస్ అయ్యింది. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి చంద్రశేఖర్ మార్ఫింగ్ వీడియోలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇక బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ సైతం దీన్ని క్రియేట్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

    మరోవైపు రష్మిక స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉంది. పుష్ప 2, యానిమల్ వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో ఆమె నటిస్తోంది. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. యానిమల్ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తుంది.