Rashmika Mandanna Lesbian Role: మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈమధ్య కాలం లో నటీనటులు సరికొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటి పాత్రలు చేస్తే జనాలు ఏమనుకుంటారో?, అసలు మనకు కెరీర్ ఉంటుందో లేదో అని భయపడేవారు. కానీ ఇప్పుడు అలాంటి భయాలు ఏమి లేవు, కాస్త కొత్త రకం పాత్ర అయితే చాలు, కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటున్నారు నటీనటులు. అలాంటి నటీనటుల జాబితా లో ఇప్పుడు రష్మిక(Rashmika Mandanna), కృతి సనన్(Kriti Sanon) వంటి వారు కూడా చేరిపోయారు. పాన్ ఇండియన్ లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లు వీళ్లిద్దరు. కృతి సనన్ తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు ని అందుకుంది, ఇక రష్మిక కూడా తానూ ఎలాంటి పాత్రని అయినా చెయ్యగలని అని రీసెంట్ గా తన కొత్త సినిమాల ద్వారా నిరూపించుకుంది.
వీళ్లిద్దరు కలిసి ఇప్పుడు బాలీవుడ్ లో ‘కాక్ టైల్ 2′(Cocktail 2 Movie) చిత్రం లో నటిస్తున్నారు. షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో, వీళ్లిద్దరు హీరోయిన్స్ గా నటిస్తుండగా , సంజయ్ దత్(Sanjay Dutt), అర్జున్ రాంపాల్(Arjun Rampal), డింపుల్ కపాడియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హామీ ఆడజానియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమధ్య కాలం లో బాలీవుడ్ లో అనేక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలని నిర్మించిన ‘Maddock’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2012 వ సంవత్సరం లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే, డియానా పేంటీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కాక్ టైల్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆరోజుల్లో ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందులో నటించిన నటీనటులందరికీ మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘కాక్ టైల్ 2’ లో నటించే నటీనటులకు కూడా అలాంటి మంచి పేరే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కృతి సనన్, రష్మిక లెస్బియన్ కపుల్ గా కనిపించబోతున్నారట. అంటే వీళ్లిద్దరు ఒకరిని ఒకరు గాఢం ప్రేమించుకోవడం, వీళ్ళ మధ్య రొమాన్స్ జరగడం, ఇలాంటివన్నీ ఈ చిత్రం లో చూపించబోతున్నారట. వీరిలో ఒకరిని హీరో షాహిద్ కపూర్ ప్రేమిస్తే, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దాని మీద స్టోరీ ని డెవలప్ చేశారట. చాలా కొత్తగా ఉంది కదూ. అయితే ఇద్దరు టాప్ హీరోయిన్స్ లెస్బియన్ కపుల్ గా నటిస్తే ఆడియన్స్ ఎంత వరకు తీసుకోగలరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది సరైన పద్దతిలో డీల్ చేసుంటే పర్లేదు, లేదంటే బాగా మిస్ ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.
#KritiSanon and #RashmikaMandanna to play a lesbian couple in #Cocktail2. pic.twitter.com/eTSoXpgDWY
— FILMYNEWS (@filmynewsnetwrk) February 19, 2026