Rashmika Mandanna: స్టార్ హీరోయిన్లు వరుసగా సినిమాలతో బిజీగా ఉంటారు. ఖాళీ టైంలో ఏం చేయాలో పాలుపోక తమ పెంపుడు జంతువులతో సేదతీరుతున్నారు. రాంచరణ్ నుంచి మొదలుకొని రష్మిక మందాన వరకూ పెంపుడు జంతువులను పెంచుకోవడం హాబీగా మారింది.
తాజాగా రష్మిక మందానా తన పెంపుడు కుక్కపిల్లతో సేదతీరింది. అద్దంలో చూపిస్తూ ప్రేమను చాటింది. ఆ కుక్కపిల్ల మన బ్యూటీ రష్మికను ముద్దులతో మంచేసింది. దాని ప్రేమకు రష్మిక సైతం ముద్దు చేసింది.
Also Read: Karthik Rathnam: పెళ్లిపీటలెక్కబోతున్న వెంకటేశ్ కుమారుడు.. పెళ్లి కూతురు ఎవరో తెలిసా?
రష్మిక మందన్నాకు తన పెంపుడు కుక్కపిల్ల ‘ఆరా’ అంటే చాలా ఇష్టమట.. దానికి తెగ ముద్దులు ఇస్తూ ఆ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. అది కాస్త వైరల్ అయ్యింది. రష్మిక అలా సుకుమారంగా ముద్దులు పెడుతుంటే ‘ఆ ముద్దులన్నీ దానికేనా?’ అని రష్మిక ఫ్యాన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. రష్మిక ముద్దు మురిపాలకు ఫిదా అవుతున్నారు.
రష్మిక మందానా ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కపిల్ల బ్రీడ్ పేరు ‘ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ (గోల్డెన్ కలర్)’. పురాతన కాలంలో ఇంగ్లండ్ ప్రజలు ఈ కుక్కలను వేటకు తీసుకెళ్లేవారు. వేటగాళ్లు అడవుల్లో వేటకి వెళ్లినప్పుడు పక్షులను బాణాలతో గురిచూసి కొడితే ఆ పక్షులను వెతికి వెటగాడి దగ్గరకు తేవడంలో ఇంగ్లీష్ కాకర్ స్పానియల్ కుక్కలు బాగా ఉపయోగపడేవి. ప్రస్తుతం ఈ వేటాడే కుక్కలను ఇళ్లలో కూడా పెంచుతున్నారు. చాలా ఆకర్షనీయంగా ఉండే ఈ జాతి కుక్కలు మనుషులతో బాగా కలిసిపోతాయి. ఇతర మనుషులపై, జంతువులపై ఈ కుక్కలు దాడి చేయవు. ఇవి ఇంటికి కాపాలా కాసేందుకు పనికిరావు. భారత్ లో ఈ జాతి కుక్కపిల్ల ధర రూ.15వేల వరకూ ఉంటుంది.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి సొంత పార్టీ వారి నుంచే ముప్పు?