Rashmika Mandanna: రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో కనిపించిన ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend) చిత్రం రీసెంట్ గానే ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో దిగ్విజయంగా నడుస్తోంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. మూవీ టీం మొత్తం ఈ ఈవెంట్ లో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక డైరెక్టర్ గా రాహుల్ రవీంద్రన్ ఆనందం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంతకు ముందు ఆయన రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు కానీ, అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ఆయన కెరీర్ లో మొట్టమొదటి సక్సెస్ ని అందుకున్నట్టు అయ్యింది. రష్మిక కి కూడా ఇది తొలి లేడీ ఓరియెంటెడ్ మూవీ. తొలిసినిమానే ఈ రేంజ్ సక్సెస్ అవ్వడం తో ఆమెకూడా నిన్న సక్సెస్ ఈవెంట్ లో ఫుల్ జోష్ తో ఉన్నారు.
ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి గా రష్మిక కాబోయే భర్త విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడుతాడో అని అభిమానులు మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. ఎందుకంటే రీసెంట్ గానే వీళ్లిద్దరికీ నిశ్చితార్థం అయ్యింది. ఈ విషయాన్నీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ ఈవెంట్ ని వేదికగా చేసుకొని నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన చేసి, పెళ్లి తేదీ కూడా చెప్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ, అలాంటివేమీ జరగలేదు. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఈవెంట్ లో ఒక లైవ్ పెర్ఫార్మన్స్ ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరినీ మంత్రం ముగ్దులు అయ్యేలా చేసింది. రష్మిక అయితే ఆ లైవ్ పెర్ఫార్మన్స్ చూస్తే భావోద్వేగానికి గురై కన్నీళ్లు కూడా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
సంగీతానికి ఎలాంటి వారైనా కరిగిపోవాల్సిందే, రాళ్ళని సైతం కరిగించే శక్తి ఒక్క సంగీతానికి మాత్రమే ఉందని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వాళ్ళ మాటలు మనకు గుర్తు వస్తుంటాయి. ఇకపోతే ఈ సినిమాలోని పాటలన్నీ రాకేందు మౌళి రచించగా, హేషం అబ్దుల్ సంగీతం అందించాడు. పాటలకు మొదట్లో పెద్దగా రెస్పాన్స్ అయితే రాలేదు కానీ, సినిమా థియేటర్స్ లో విడుదలయ్యాక మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మొదటి వారం లోపే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాలను సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.