Kaantha Movie First Review: సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు విలక్షణమైన నటనను కనబరుస్తూ మంచి సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రానా ఒకరైతే, మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి దుల్కర్ సల్మాన్ ఒకరు కావడం విశేషం… ఇక లక్కీగా వీళ్ళిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించారు. ‘కాంత’ సినిమాతో మరోసారి వీళ్ళు కలిసిన నటించడం విశేషం… ఈ సినిమా నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది… ఎంకే త్యాగరాజ భగవతార్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం…ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలను మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం…
ఒక దర్శకుడికి హీరోకి ఓమధ్య ఈగో క్లాశేష్ వస్తే వాళ్ళు చేయాల్సిన సినిమా ఎటు పోతోంది. ఈగోలను పెట్టుకొని సినిమా చేయడం వల్ల ఎవరికి నష్టం వస్తోంది.అసలు ఎందుకీ ఈగో లు ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ముందుకు సాగొచ్చు కదా అనే పాయింట్ అయితే ఈ సినిమాలో తెలియజేసే ప్రయత్నం చేశారు… ఇక దుల్కర్ సల్మాన్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమాలో అతని నటన అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్ లో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది…
ఈ సినిమాలో ఆయన హీరో పాత్ర పోషించాడు. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో సముద్రఖని కనిపించారు. వీళ్లిద్దరి మధ్య ఈగో క్లాశేష్ రావడం ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ఎలాంటి ఎత్తులు వేశారు అనేది ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. రానా కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించి మెప్పించాడు…
సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయట. ఇక ఈ సినిమాను విజువల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ గా చాలా బాగుందట…అంత బాగున్నప్పటికి క్లైమాక్స్ తీర్చి దిద్దిన విధానం అంత ఎఫెక్టివ్ గా లేదనే వార్తలు వస్తున్నాయి…
దాంతో అదొక్కటి కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది కదా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి… భాగ్య శ్రీ బోర్ సే చాలా అద్భుతమైన నటన కనబరించిందట. సెన్సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక రేపు రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ను సంపాదించుకుంటుంది సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలపాటు వెయిట్ చేయాల్సిందే…