Rashmika Kriti Viral Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుసగా అవకాశాలు సంపాదిస్తూ , మార్కెట్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే, అది రష్మిక మందాన మాత్రమే. ఈమెకు మన సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో, నార్త్ ఇండియా లో కూడా అదే రేంజ్ క్రేజ్ ఉంది. బాలీవుడ్ లో యానిమల్ , పుష్ప సిరీస్, చావా వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో , తిరుగులేని స్టార్ హీరోయిన్ గా స్థిరపడింది రష్మిక. రీసెంట్ గా ఆమె షాహిద్ కపూర్ హీరో గా నటించిన ‘కాక్ టైల్ 2’ లో ఒక హీరోయిన్ గా నటించింది. మరో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. రేపు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న సందర్భంగా ప్రొమోషన్స్ కార్యక్రమం లో మూవీ టీం పెద్ద ఎత్తున పాల్గొంటుంది.
రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్ లో ఒక ఫన్నీ సందర్భం చోటు చేసుకుంది. షాహిద్ కపూర్ మాట్లాడుతున్న సమయం లో , రష్మిక మందాన భుజం పై కృతి సనన్ చేతులో వేసే క్రమంలో , ఆమె మోచెయ్యి రష్మిక చేతికి తగిలింది. అందుకు రష్మిక ఫన్నీ గా దెబ్బ తగిలింది అని రియాక్షన్ ఇవ్వడం తో, కృతి సనన్ ఆమెకు క్షమాపణలు చెప్పి దగ్గరకు తీసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ఇద్దరి స్టార్ హీరోయిన్స్ మధ్య ఇంతటి స్నేహపూర్వక వాతావరణం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ఫన్నీ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే రీసెంట్ గా ఈ ముగ్గురు ఒక మ్యూజిక్ ఈవెంట్ కోసం మాల్ కి వెళ్లడం , అక్కడ చోటు చేసుకున్న సంఘటనలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.
మాల్ కి వీళ్ళు వచ్చారనే విషయం తెలుసుకున్న అభిమానులు వేల సంఖ్యలో హాజరయ్యారు. అభిమానులు స్టేజి మీదకు దూసుకొని రావడం తో ఈవెంట్ ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ సంఘటన కారణంగా రష్మిక బాగా భయపడిపోయింది. దీంతో కృతి సనన్ రష్మిక కి ఒక రక్షక కవచం లాగా మారి , దగ్గరకు తీసుకొని ఆ ఈవెంట్ నుండి జాగ్రత్తగా బయటపడేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ప్రతీ ఒక్కరు కృతి సనన్ చూపించిన ప్రేమాభిమానాలు, కేరింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి సంఘటనల కారణంగా ఈ సినిమాకు పబ్లిసిటీ భారీగానే జరిగింది. మరి అది కలెక్షన్స్ రూపం లో మారుతుందా లేదా అనేది చూడాలి.
View this post on Instagram
