Rashmika Mandanna: రష్మిక మందానా.. ఒకప్పుడు తెలుగు హీరోయిన్ మాత్రమే.. కానీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంది. ‘పుష్ప’ మూవీ తో ఆమెకు నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. దీంతో ఈ భామ బీ టౌన్ లో మిగతా బ్యూటీలకు పోటీనిస్తోంది. ఓ వైపు సినిమాల్లో బిజీ గా నటిస్తూనే మరోవైపు అందచందాలను నెట్టింట్లో ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. మామూలుగానే తన స్మైల్ తో యూత్ ను కట్టిపడేసే రష్మిక ఇక తన గ్లామర్ ఫోజులతో మరింత జోష్ తెప్పిస్తోంది. లేటెస్టుగా ఈ అమ్మడు ఓ యాడ్ ఫోటో షూటింగ్ లో పాల్గొంది. ఇందులో రష్మిక ఎద అందాలను చూసి యూత్ అంతా వీకెండ్ ట్రీట్ అనుకుంటున్నారు.

తెలుగులో ‘చలో’ సినిమాతో పరిచయం అయిన రష్మిక ను మొదట్లో ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి ‘గీతగోవిందం’లో తన ఫర్ఫామెన్స్ తో రచ్చ చేసింది. అమ్మడు నటనకు ఫిదా అయిన కుర్రాళ్లు అప్పటి నుంచి ఆమెను ఫాలో అవుతున్నారు. అటు ఇండస్ట్రీ సైతం రష్మిక ఫ్యాన్స్ అయిపోయింది. వరుసగా ఆఫర్లు ఇచ్చి ఆమెకు గుర్తింపునిచ్చింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప’తో రష్మిక నేషనల్ లెవల్లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె చేసిన ‘సామీ..సామీ’ సాంగ్ కు వరల్డ్ లెవల్ లో రష్మిక పేరు మారుమోగింది.
ఈ నేపథ్యంలో రష్మికు బాలీవుడ్లో సినిమా ఆఫర్లతో పాటు ప్రముఖ కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ‘స్పోర్టో’ అనే క్లాత్ స్టోర్ కు ప్రమోషన్లో భాగంగా హాట్ హాట్ ఫొటోలకు ఫోజిలిచ్చింది. ఇందులో రష్మిక బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఎద అందాలను టైట్ గా షో చేసింది. ఓ వైపు చక్కని స్మైల్ ఇస్తూనే ఇటు అందాలను ఆరబోస్తూ అమ్మడు అమాయక చూపులకు యూత్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ లో ప్రమోషనల్ లో పాల్గొన్న ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

రష్మిక మందానా తెలుగులో ‘పుష్ప 2’తో పాటు మరో సినిమాకు కమిట్ అయినట్లు సమాచారం. అటు ఎన్టీఆర్ 30లో నటిస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళం, బాలీవుడ్లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ఆ మధ్య విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవులు టూర్ కు వెళ్లిన సందర్భంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలు వచ్చాయి. కానీ వాటిపై రష్మిక అస్సలు స్పందించలేదు.