Rashmika Mandana: స్టార్ లేడీ రష్మిక మందాన బ్రేకుల్లేని బుల్డోజర్ లా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా తక్కువ టైం లో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసిన ఈ లక్కీ లేడీ చేతిలో భారీ పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. కోలీవుడ్ టు బాలీవుడ్ అమ్మడు చెడుగుడు ఆడేస్తుంది. ఈమెకున్న పాపులారిటీ చూసిన దర్శక నిర్మాతలు బ్లాంక్ చెక్స్ తీసుకొని వెంటపడుతున్నారు. రష్మిక నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. వాటిలో విజయ్ వారసుడు సంక్రాంతికి సిద్ధం అవుతుంది. షూటింగ్ దాదాపు పూర్తి కాగా 2023 జనవరిలో విడుదల కానుంది. విజయ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారసుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు.

రష్మిక చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు పుష్ప 2 అని చెప్పొచ్చు. శ్రీవల్లిగా పార్ట్ వన్ లో మెప్పించిన రష్మిక సీక్వెల్ కి సిద్దమవుతుంది. పుష్ప1 భారీ సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ రెండింతలు చేశారు. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప ది రూల్ తెరకెక్కనుంది. దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు భారీగా క్యాస్టింగ్ చేస్తున్నారట. అల్లు అర్జున్ పుష్ప 2 తో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు చేయాలని చూస్తున్నాడు. పుష్ప 2 లో రష్మిక పాత్ర చనిపోతుందనే టాక్ వినిపిస్తుంది.

ఇక రష్మిక చేస్తున్న బాలీవుడ్ చిత్రాలు యానిమల్, మిషన్ మజ్ను. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రాన్ని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. సందీప్ రెడ్డి ట్రాక్ రికార్డు నేపథ్యంలో యానిమల్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే సిద్దార్థ్ మల్హోత్రాకి జంటగా మిషన్ మజ్నులో రష్మిక నటిస్తున్నారు. రష్మిక డెబ్యూ బాలీవుడ్ మూవీ గుడ్ బై ఇటీవల విడుదలైంది.

మరోవైపు ఎఫైర్ రూమర్స్ తో రష్మిక వార్తల్లో ఉంటుంది. విజయ్ దేవరకొండతో సన్నిహితంగా ఉంటున్న రష్మిక… ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లగా అనుమానాలు మరింత బలపడ్డాయి. రష్మిక- విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారు అధికారిక ప్రకటనే మిగిలి ఉందని అంటున్నారు. దీనిపై అస్పష్టంగా మాట్లాడుతున్న రష్మిక క్లారిటీ ఇవ్వడం లేదు. మరో వైపు సోషల్ మీడియా వేదికగా సూపర్ గ్లామరస్ ఫోటోలతో రష్మిక రచ్చ చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ జాకెట్, డిజైనర్ శారీలో రష్మిక హాట్ ఫోజులతో చంపేశారు.