సంచలన నిజం చెప్పిన రష్మీ.. అభిమానుల షాక్ 

రష్మీ గౌతమ్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా ఉండదు. బుల్లితెరపై జబర్దస్తీ చేస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై అందాల విందు ఇస్తుంటుంది. యాంకరింగ్‌తోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. అందాల ఆరబోత, శృంగార సన్నివేశాల్లో నటించడంలోనూ వెనక్కి తగ్గకపోయినా ఆమెకు సిల్వర్ స్క్రీన్ నిరాశనే మిగిల్చింది. ఆమె నటించిన సినిమాల్లో ఒక్క ‘గుంటూరు టాకీస్’ మినహా మరే సినిమా అంతగా రిజల్ట్ రాబట్టలేదు. Also Read […]

Written By: NARESH, Updated On : September 15, 2020 11:48 am
Follow us on

రష్మీ గౌతమ్‌.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా ఉండదు. బుల్లితెరపై జబర్దస్తీ చేస్తూనే అప్పుడప్పుడు వెండితెరపై అందాల విందు ఇస్తుంటుంది. యాంకరింగ్‌తోనే పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. అందాల ఆరబోత, శృంగార సన్నివేశాల్లో నటించడంలోనూ వెనక్కి తగ్గకపోయినా ఆమెకు సిల్వర్ స్క్రీన్ నిరాశనే మిగిల్చింది. ఆమె నటించిన సినిమాల్లో ఒక్క ‘గుంటూరు టాకీస్’ మినహా మరే సినిమా అంతగా రిజల్ట్ రాబట్టలేదు.

Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

ఇక సిల్వర్‌‌ స్క్రీన్ తనకు వచ్చిరాదనుకుందో ఏమో బుల్లితెర మీదనే ఫోకస్‌ పెట్టింది. బుల్లితెర ప్రోగ్రామ్స్‌కే ప్రాధాన్యం ఇస్తూ అలరిస్తోంది. ఏ పండుగ వచ్చినా ఆమె మెరవకుండా ఆ పండుగ రోజు గడవదు. ఈ యంగ్ లేడీ బ్యాచిలర్ పెళ్లిని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేస్తూ వచ్చిన ఎన్నో ప్రోగ్రామ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక రష్మీ-, సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ గురించి బుల్లితెర మీద ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తమ లవ్ ట్రాక్‌పై వస్తున్న రూమర్స్‌ని ఎన్నిసార్లు ఖండించినా వాటికి మాత్రం బ్రేకులు పడే అవకాశమే కనిపించడం లేదు. వారు కూడా రోజురోజుకూ వాటికి ఉపద్రవం కల్పిస్తున్నారనే తప్ప.. ఎక్కడా తగ్గినట్లుగా లేరు.

అంతలా ఆకట్టుకుంటున్న ఈ జంటలో ప్రధానంగా రష్మీ వయసు మీద ఎప్పటి నుంచో చాలా మంది కన్ను ఉంది. గూగుల్‌లోనూ సెర్చ్‌ చేశారు. ఎన్నో షోలలో ఆమె వయసు గురించి తెలుసుకునేందుకు ట్రై చేశారు. కానీ.. రష్మీ మాత్రం తన ఏజ్‌ విషయంలో ఇప్పటికీ సీక్రెట్‌ మెయింటెన్‌ చేస్తోంది. తాజాగా అందరి ముందే అనుకోకుండా ఓపెన్ అయింది.

ఇటీవల జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్‌లో రాకేష్ స్కిట్‌లో భాగంగా ఆ టీమ్‌ మెంబర్ రోహిణి యాంకర్ రష్మీ వయస్సు చెప్పించింది. ‘నీకు ఇప్పుడు ఎన్నో సంవత్సరం’ అని రోహిణి అడగ్గా దానికి పదహారు అంటూ సమాధానమిచ్చింది రష్మీ. సిక్స్‌టీన్ అని ఎన్నేళ్లుగా చెబుతున్నావు అని రోహిణి మరోసారి అడుగగా పదహారేళ్ల నుంచి ఏదో అలా అంటూ ప్రస్తుతం తన ఏజ్ 32 అని చెప్పకనే చెప్పేసింది. దీంతో రష్మీ వయస్సుపై జనాల్లో ఇప్పటిదాక నెలకొన్న ప్రశ్నలకు ఆన్సర్‌‌ దొరికినట్లయింది.