Rashmi Gautam In Bigg Boss 7: రష్మీ గౌతమ్ బుల్లితెర స్టార్ గా ఉన్నారు. జబర్దస్త్ షో వేదికగా ఆమె పాపులర్ అయ్యారు. ఈ ఫేమ్ ఆమెకు సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. పదికి పైగా చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు విజయాలు దక్కలేదు. లేకుంటే స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యేది. ఈ మధ్య రష్మీకి వెండితెర ఆఫర్స్ రావడం లేదు. బుల్లితెర మీద మాత్రం దూసుకుపోతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా చేస్తుంది. ప్రమోషన్స్, ఈవెంట్స్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా రష్మీ పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది.
కాగా రష్మీ గౌతమ్ ని బిగ్ బాస్ షోకి తేవాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2017లో సీజన్ 1 మొదలు కాగా పలుమార్లు రష్మీని నిర్వాహకులు సంప్రదించారు. రష్మీ సున్నితంగా ఈ ఆఫర్ తిరస్కరిస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఆమె ఒప్పుకున్నారన్న మాట వినిపిస్తోంది. సీజన్ 7 లో రష్మీ పాల్గొంటున్నారు. చర్చలు జరిపిన టీమ్ ఆమెను లైన్లోకి తెచ్చారట.
ఈ క్రమంలో రష్మీకి భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. రోజుకు లక్షల్లో సంపాదించే రష్మీ అదే స్థాయిలో డిమాండ్ చేశారట. రోజుకు రూ. 1.5 నుండి 2 లక్షల ఒప్పందంపై ఆమెను హౌస్లోకి తెస్తున్నారట. అంటే ఒక నాలుగు వారాలు ఉన్నా రూ. 50 నుండి 60 లక్షలు సొంతం అవుతాయి. రష్మీ హౌస్లోకి రావాలంటే ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీకి గుడ్ బై చెప్పాలి.
మల్లెమాల సంస్థ ఒకసారి బయటకు వెళితే మరలా రానివ్వదు. గతంలో పలువురు విషయంలో ఇది రుజువైంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ముక్కు అవినాష్, ఫైమా, చంటి జబర్దస్త్ కి దూరమయ్యారు. కాబట్టి రష్మీ రిస్క్ చేస్తున్నట్లే. అందుకే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారట. మరి రష్మీ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రముఖంగా వినిపిస్తోంది.