Rashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమా తోనే ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది రాశీ ఖన్నా. ఆ తరవాత వచ్చిన ‘జిల్’ సినిమాలో గ్లామర్ ట్రీట్ ఇచ్చి యువకుల హృదయాల్ని కొల్లగొట్టింది. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా దున్నేస్తున్న ఈ భామ, వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళంలో అరడజనుకు పైగా చిత్రాల వరకు చేస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత టాలీవుడ్ లో చిన్న గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ పలు సినిమాలతో బిజీ అవుతుంది.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాలో నటిస్తుంది రాశీఖన్నా. అందులో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు. నేడు రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ నుంచి రాశీ ఖన్నా బర్త్ డే స్పెషల్ టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేశారు. గత సినిమా ప్రతిరోజూ పండగే లో రాశీని ఏంజర్ ఆర్నా గా చూపించిన మారుతి ఈసారి ఆమెను నిజంగా ఏంజెల్‌గా చూపించారు. దివి నుంచి భువికి దిగొచ్చిన దేవకన్యలా ఆమెను ప్రజెంట్ చేశారు. ఈ విజువల్ ఓ పాటలోది అని తెలుస్తోంది. మొత్తం మీద రాశీ ఖన్నాకు మారుతి అండ్ ‘పక్కా కమర్షియల్’ టీమ్ మాంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని నెటిజన్స్ అంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై ‘బన్నీ’ వాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.కె.ఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 18న సినిమా విడుదల కానుంది.
"Pure as angel, Sweet as Love" 🧡🧚♀️
Happy Birthday 💐🎂to our gorgeous & most talented actress @RaashiiKhanna_ –
Team #PakkaCommercial #HBDRaashiiKhanna ▶ https://t.co/AsLonSMbzg#AlluAravind @YoursGopichand @DirectorMaruthi #BunnyVas @JxBe #KarmChawla @SKNonline pic.twitter.com/UnNj8c8oUC— Director Maruthi (@DirectorMaruthi) November 30, 2021