Child in photo rare to find : ఈ ఫోటో లో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, అతి చిన్న వయస్సు లోనే ఈమె హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది. మొదటి సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఈమెకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ఎందుకంటే ఈమెకు కుర్రాళ్లు చూపులు తిప్పుకోలేని అందం ఉంది. ఆ అందానికి తగ్గట్టు టాలెంట్ కూడా ఉంది. కచ్చితంగా ఈ అమ్మాయి రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ ని ఏలుతుంది అని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే అతి తక్కువ సమయంలో నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది. ఈమె చేసిన సినిమాలలో అత్యధిక శాతం ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి. కానీ ఆమెకు ఉన్న క్రేజ్, టాలెంట్ కారణంగా అవకాశాల మీద అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్యనే ఈమె బాలీవుడ్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె మరెవరో కాదు, శ్రీలీల(Sreeleela).
‘పెళ్లి సందడి’ అనే చిత్రం తో మొదలైన శ్రీలీల తెలుగు సినిమా ప్రస్థానం ఏ రేంజ్ వరకు వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకపక్క డాక్టర్ చదువు చదువుతూనే మరోపక్క సినిమాలు చేస్తూ చిన్న వయస్సు లోనే క్షణం తీరిక లేకుండా గడుపుతుంది ఈ క్యూట్ బ్యూటీ. అయితే అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఈమెకు స్క్రిప్ట్స్ ని ఎంచుకోవడం సరిగా రాదనీ, అందువల్ల వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటుందని విశ్లేషకుల అభిప్రాయం. శ్రీలీల అభిమానులు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవమే. కొన్ని సినిమాల్లో అయితే కేవలం శ్రీలీల ని పాటల్లో డ్యాన్స్ కోసమే తీసుకున్నారు. దాంతో డజనుకు పైగా సినిమాలు చేస్తే అందులో కేవలం మూడు హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం శ్రీలీల వరుసగా బాలీవుడ్ చిత్రాలను ఒప్పుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఆమెకు ప్రస్తుతం వస్తున్న బాలీవుడ్ ఆఫర్స్ ని చూస్తుంటే ఒకప్పటి దివ్య భారతి గుర్తుకు వస్తుంది.
Also Read : ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరోయిన్లు.. ఆశలన్నీ పవన్ సినిమాల మీదనే పెట్టుకున్న బ్యూటీస్..
ఆమెకు కూడా ఇదే విధంగా బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. శ్రీదేవి, కరిష్మా కపూర్,జుహీ చావ్లా ఇలా ఎంతో మంది టాప్ హీరోయిన్స్ అవకాశాలకు గండి కొట్టింది దివ్య భారతి. ప్రస్తుతం శ్రీలీల కూడా అదే ఊపులో ఉంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లో నటిస్తున్న శ్రీలీల, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కూడా ఒక సినిమా చేస్తుంది . వీటితో పాటు ఆమె మరో రెండు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కి సంతకం చేసింది. మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. ఇకపోతే ఈ నెల 12 నుండి ఆమె పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతుంది.