Rao Ramesh: యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 26వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే హిట్ కల ఉట్టిపడుతుంది. ప్రొమోషన్స్ కూడా ఎంతో ఉత్సాహం గా చేస్తున్నారు. అయితే ట్రైలర్, టీజర్ చూసినప్పుడు సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులని, వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని తెలుస్తుంది. ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని అర్థం అవుతుంది. కానీ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం వీళ్లిద్దరు ఎడమొహం,పెడమొహం లాగ ఉంటున్నారట. రావు రమేష్(Rao Ramesh) ప్రొమోషన్స్ కి వస్తే నేను రాను అంటూ హీరో సందీప్ కిషన్ భీష్మించి కూర్చున్నాడట. వీళ్లిద్దరికీ సర్దిచెప్పలేక పాపం నిర్మాత, డైరెక్టర్ నలిగిపోతున్నారు.
బాగా గమనిస్తే ఈ సినిమా ప్రొమోషన్స్ లో రావు రమేష్ ఉంటే సందీప్ కిషన్ ఉండదు, సందీప్ కిషన్ ఉంటే రావు రమేష్ ఉండదు. సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషించిన వీళ్లిద్దరు కలిసి ప్రొమోషన్స్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. కానీ అది జరగడం లేదు. కారణం మూవీ షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏర్పడడం వల్లే. ఒక అంశంలో రావు రమేష్ సందీప్ కిషన్ పై మూవీ సెట్స్ లో కోపడ్డాడట. తన తప్పు లేనప్పటికీ రావు రమేష్ ఫైర్ అవ్వడం పై సందీప్ కిషన్ కూడా రివర్స్ లో కౌంటర్ ఇచ్చాడట. అలా వీళ్లిద్దరి మధ్య షూటింగ్ సమయంలోనే గొడవ అవ్వడం వల్ల ప్రొమోషన్స్ లో ఇద్దరు కలిసి పాల్గొనడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇంతకీ వీళ్లిద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏమి జరిగింది?, విడుదలకు దగ్గర్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ(Ritu Varma) నటించిన సంగతి తెలిసిందే. ఈమె కూడా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఇక మన చిన్నతనం లో అక్కినేని నాగార్జున ఆల్ టైం క్లాసిక్ చిత్రం ‘మన్మథుడు’ లో హీరోయిన్ గా నటించిన అన్షు ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది. రావు రమేష్ కి జోడిగా చాలా ఫన్నీ క్యారక్టర్ లో ఆమె కనిపించింది. చాలా కాలం నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్, ఈ సినిమా తర్వాత మరో లెవెల్ కి వెళ్లాడని బలమైన నమ్మకం తో ఉన్నాడు. గత ఏడాది ఆయన హీరోగా నటించిన ‘భైరవ కోన’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఊపులో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాడు, చూడాలి మరి ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది.