https://oktelugu.com/

Rangamarthanda: ఎక్స్ క్లూజివ్ : ‘రంగమార్తాండ’ చివరి షెడ్యూల్ డిటైల్స్ !

Rangamarthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ టైటిల్ వినడానికి చాలా వినసొంపుగా ఉంది. అయితే, రెండేళ్ల క్రితం మొదలైంది ఈ ‘రంగమార్తాండ’. కానీ ఇంతవరకు ఈ సినిమాకి శుభం కార్డు వేయలేకపోయాడు కృష్ణవంశీ. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఒక చిన్న సినిమాని కూడా ఇలా మూడేళ్లు తీస్తే… నిర్మాత పరిస్థితి ఏమిటి ? అందుకే, ఇక వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 03:23 PM IST
    Follow us on

    Rangamarthanda: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన శక్తిని అంతా ధారపోసి చేస్తున్న సినిమా ‘రంగమార్తాండ’. ఈ టైటిల్ వినడానికి చాలా వినసొంపుగా ఉంది. అయితే, రెండేళ్ల క్రితం మొదలైంది ఈ ‘రంగమార్తాండ’. కానీ ఇంతవరకు ఈ సినిమాకి శుభం కార్డు వేయలేకపోయాడు కృష్ణవంశీ. కారణాలు ఏమైనా కావొచ్చు.. ఒక చిన్న సినిమాని కూడా ఇలా మూడేళ్లు తీస్తే… నిర్మాత పరిస్థితి ఏమిటి ? అందుకే, ఇక వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.

    Krishna Vamsi

    ఈ క్రమంలో ఈ రోజు హైదరాబాద్‌ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. కాగా ఈ చివరి షెడ్యూల్‌లో బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా మరియు ప్రకాష్ రాజ్ ల పై ప్రధాన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక త్వరలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఈ సినిమా సెట్స్‌ లో జాయిన్ కానున్నాడు.

    Also Read: వర్కౌట్ కాదన్నా నితిన్ ఆశ చంపుకోవట్లేదు !

    అన్నట్టు ఆ మధ్య ‘రంగమార్తాండ’ మధ్యలోనే ఆగిపోయింది అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ, నిజానికి ఈ సినిమా ఆగిపోలేదు. ఆగుతూ సాగుతూ ఉంది. అసలు ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం కృష్ణవంశీనే. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకి నలుగురు రచయితలను పెట్టుకున్నాడు. పైగా తన సినీ కెరీర్ లోనే ఈ సినిమా కోసం తీసుకున్నన్నీ జాగ్రతలు, మరో సినిమా కోసం తీసుకోలేదు.

    ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని కృష్ణవంశీ ఆశ. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంట. సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు. అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా బలమైనదట, కృష్ణవంశీ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.

    Also Read: ఏపీ సర్కార్ కు రాంగోపాల్ వర్మ సూటి ప్రశ్నలు.. సమాధానం చెప్పే దమ్ము ఉందా?

    Tags