https://oktelugu.com/

Rangabali Twitter Review: రంగబలి ట్విట్టర్ టాక్: అదొక్కటే రిలీఫ్, ప్రేక్షకులను చంపేశారు భయ్యా!

నాగ శౌర్య హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు. అయినా లక్ దగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన అశ్వద్ధామ మాత్రమే పర్లేదు అనిపించింది.

Written By: , Updated On : July 7, 2023 / 08:09 AM IST
Rangabali Twitter Review

Rangabali Twitter Review

Follow us on

Rangabali Twitter Review: యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కించిన చిత్రం రంగబలి. జులై 7న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. రంగబలి ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో ట్విట్టర్ టాక్ ఏమిటో చూద్దాం…

https://twitter.com/436game/status/1677112309364273152?s=20

నాగ శౌర్య హిట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటున్నాడు. అయినా లక్ దగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన అశ్వద్ధామ మాత్రమే పర్లేదు అనిపించింది. హిట్ మూవీ అంటే ఛలో నే. అంటే ఛలో తర్వాత ఆయనకు క్లీన్ హిట్ పడలేదు. గత రిలీజ్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి డిజాస్టర్. ఈసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎంచుకున్నాడు. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి రంగబలి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్ర టైటిల్, ప్రోమోలు ఒకింత ఆసక్తిరేపాయి.

కథ విషయానికి వస్తే అల్లరి చిల్లరిగా తిరిగే నాగ శౌర్యకు సొంత ఊరంటే ప్రాణం. ఊరిని, మిత్రులను వదిలి ఎక్కడికి వెళ్లకూడని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఆ ఊళ్ళో మెడికల్ షాప్ నడిపే వాళ్ళ నాన్న ఫార్మసీ కోర్సు పూర్తి చేసి రమ్మని వైజాగ్ పంపుతాడు. ఆ కోర్స్ పూర్తి అయితే ఎంచక్కగా మెడికల్ షాప్ చూసుకుంటూ ఊర్లో సెటిల్ కావచ్చని వైజాగ్ వెళతాడు. అక్కడ యుక్తి తరేజాను చూసి ప్రేమలో పడతాడు. వారి ప్రేమను యుక్తి ఫాదర్ మురళీ శర్మ ఒప్పుకుంటాడు… అయితే ఒక కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ ఏమిటీ? హీరో ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే రంగబలి చిత్రం.

ఈ మూవీ గురించి సోషల్ మీడియా టాక్ బాగా నెగిటివ్ గా ఉంది. కథ, కథనంలో దమ్ములేదని ఆడియన్స్ తేల్చేశారు. ఫస్ట్ హాఫ్ ఫన్నీ, రొమాంటిక్ సన్నివేశాలతో కొంత మేర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో చేతులు ఎత్తేశాడు. అక్కడి నుండి కథ ఎలా నడపాలో? ఎలాంటి ముగింపు ఇవ్వాలో? తెలియక తికమక పడ్డాడని అంటున్నారు.

https://twitter.com/BillMcgan/status/1677101596776251392?s=20

కమెడియన్ సత్య సినిమాకు ఓన్లీ రిలీఫ్. సత్య కామెడీ మాత్రం పండింది. నాగ శౌర్య స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ పర్లేదు. ఇక కథను ముగించిన విధానం మరింత దారుణం అంటున్నారు. మొత్తంగా నెటిజెన్స్ అభిప్రాయంలో రంగబలికి వెళితే ప్రేక్షకులు బలి. నాగ శౌర్యకు మళ్ళీ నిరాశే ఎదురైందని అభిప్రాయపడుతున్నారు