Shamshera: ‘మంగలిని చూసి గాడిద కుంటినట్లు’ ఉంది బాలీవుడ్ హీరోల పరిస్థితి. ఒకపక్క ప్రభాస్, యశ్, ఎన్టీఆర్ – చరణ్ లాంటి సౌత్ హీరోలు హిందీ జనాన్ని ఊపేస్తుంటే.. సౌత్ హీరోలకు పోటీగా మరోపక్క హిందీ స్టార్ హీరోలు మాత్రం ‘మసి పూసి మారేడు కాయ చేసినట్లు’ ముందుకు పోతున్నారు. అందుకే.. హిందీ ప్రేక్షకులు వారి చిత్రాలను తిప్పి కొడుతున్నారు. అయినా, మేకపోతు గాంభీర్యం లాగా బాలీవుడ్ స్టార్లు తమ దర్పం ప్రదర్శిస్తూ.. భారీ బడ్జెట్ చిత్రాలను వదులుతూనే ఉన్నారు. కానీ, రోజురోజుకు చూసే జనమే కరువు అవుతున్నారు.

ప్రస్తుతం రణబీర్ కపూర్ సినిమా ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రస్తుత నార్త్ స్టార్ హీరోల్లో రణబీర్ టాప్ యంగ్ హీరో. పైగా ఇలాంటి హీరో పక్కన సంజయ్ దత్ లాంటి మాజీ స్టార్ హీరో కూడా నటించాడు. వీరిద్దరి కలయికలో సినిమా అంటే.. హిందీ జనానికి పండగే అనుకున్నారు. కానీ చివరకు ఇది పండగ కాదు, దండగ అని ప్రేక్షకులు తేల్చారు.
Also Read: Getup Srinu- Edukondalu: జబర్ధస్త్ లొల్లి: ఏడుకొండలకు షాక్ ఇచ్చిన గెటప్ శ్రీను
రణబీర్ – సంజయ్ దత్ ‘షంషేరా’ సినిమాకి టికెట్లు తెగక, చాలా నగరాల్లో షోలను రద్దు చేశారు. ఇలాంటి భారీ సినిమాకి జనం లేక, థియేటర్లు మూసేసే పరిస్థితి రావడం నిజంగా షాకింగ్ విషయమే. షంషేరా చిత్రం జూలై 22న విడుదలైంది. ఓపెనింగ్స్ కూడా నిరాశ పరిచాయి. మొదటి రోజుకు గానూ కేవలం ₹10.25 కోట్లను మాత్రమే ఈ భారీ చిత్రం రాబట్టింది.
కానీ ఈ సినిమాని ₹ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. హిందీలో కొమ్ములు తిరిగిన స్టార్ హీరోలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా బాలీవుడ్ హీరోల పరిస్థితి ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్న చందాన తయారైంది. ఇన్నేళ్లు ఇండియా ‘బాక్సాఫీస్ కింగ్స్’ అంటూ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసిన హిందీ హీరోలు, ఇప్పుడు షంషేరా కలెక్షన్స్ చూసి బాధ పడుతున్నారు.

షంషేరాకి కలెక్షన్లు అంత దారుణంగా వచ్చాయి. మొదటి రోజున కేవలం 35 % ఆక్యుపెన్సీ మాత్రమే వచ్చింది. మొత్తానికి బాలీవుడ్ కి డిజాస్టర్ల అమ్మ మొగుడు లాంటి సినిమాగా షంషేరా నిలవడం, రణబీర్ – సంజయ్ దత్ సినీ కెరీర్ లకే అవమానం. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు.. ఇన్నేళ్లు రణబీర్ కపూర్ స్టార్ హీరోగా చలామణి అయ్యాడని యాంటీ ఫ్యాన్స్ అప్పుడే నెగిటివ్ కామెంట్స్ కూడా మొదలుపెట్టారు.
నిజానికి రణబీర్ – సంజయ్ దత్ పేర్లు చెప్పి ‘షంషేరా’ సినిమాని భారీ రేట్లకు అమ్మారు. చివరకు బయ్యర్లను అడ్డంగా ముంచారు. ఇప్పుడు పోస్టర్ల డబ్బులు కూడా వెనక్కి రాలేదు. భారతీయ సినీ చరిత్రలోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా, ఈ చిత్రం చరిత్ర పుటల్లోకి సగర్వంగా నిలిచింది. ఎవ్వరూ ఊహించని విధంగా ‘షంషేరా’ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. చాలా చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పటికైనా బాలీవుడ్ హీరోలు తమ తల బిరుసు తగ్గించుకుని.. మంచి కథల పై కుస్తీలు పడితే.. హీరోలుగా మరో పదేళ్లు మార్కెట్ ఉంటుంది. హిందీ హీరోలూ ఇప్పటికైనా జాగ్రత్త పడండి.
Also Read: Rajinikanth: షాకింగ్ : రజినీకాంత్ విషాద మాటలకు కన్నీళ్లు పెడుతున్న అభిమానులు
[…] Also Read: Shamshera: స్టార్ హీరో సినిమాకి జనం లేక షోలు… […]