Alia Bhatt: రణబీర్ కపూర్ – ఆలియా భట్ ఏప్రిల్ 14న వివాహంతో ఒక్కటి అయ్యారు. తాజాగా ఈ జంట ‘వాస్తు’ అనే బంగ్లాలో కాపురం పెట్టారు. అయితే, ఈ ‘వాస్తు’ అనే ఇల్లుని రణబీర్ కత్రినాతో కలిసి ఉండేందుకు కొన్నాడు. రణబీర్, ఆలియా భట్ కన్నా ముందు కత్రినాతో ప్రేమలో పడ్డాడు, వీరి ప్రణయం దాదాపు పెళ్లి వరకు వెళ్ళింది.
Alia Bhatt
కానీ, పెళ్లి కాకముందే ఇద్దరి మధ్య చెడింది. బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రణబీర్, అలియాతో 5 ఏళ్ళు ప్రేమ బంధాన్ని కొనసాగించి.. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐతే, కత్రినా ఉన్న ఈ బంగ్లాలో కాపురం పెట్టడం ఆలియాకి ఇష్టం లేదు. దాంతో, రణబీర్ తన తాతయ్య రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ అనే బంగ్లాని రినోవేషన్ చేయిస్తున్నాడు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి సినిమానా మజాకా.. ఏకంగా చెప్పుల షాప్ పేరు మారిందిలా!
‘కృష్ణ రాజ్’ పనులు ఇంకా పూర్తి కావడానికి మరో ఏడాది పట్టేలా ఉంది. దాంతో, చేసేదేమి లేక కత్రినాతో రణబీర్ కలిసి ఉన్న బంగ్లాలోనే ఆలియా కాపురం పెట్టడానికి ఒప్పుకుంది. ‘కృష్ణ రాజ్’ బంగ్లా సిద్ధం అయ్యేంతవరకు ఆలియా – రణబీర్.. కత్రినా కోసం కొన్న ఇంట్లోనే ఉండబోతున్నారు.
Alia Bhatt
రణబీర్ కపూర్ ఒక్కో సినిమాకు 60 కోట్లు తీసుకుంటున్నాడు. అలియా ఒక్కో సినిమా 8 కోట్లు డిమాండ్ చేస్తోంది. సంపాదన పరంగానే కాకుండా ఆస్తుల పరంగా లెక్కలు వేసుకున్నా ఈ జంటకి 800 కోట్లు నెట్ వర్త్ ఉంది. కాబట్టి.. మరో బంగ్లా కొనడం పెద్ద మ్యాటర్ ఏమి కాదు. కానీ.. రాజ్ కపూర్ కట్టించిన ‘కృష్ణ రాజ్’ బంగ్లాలోనే ఉండాలని రణబీర్ ఆశ పడుతున్నాడు.
ఏది ఏమైనా గతంలో అరడజనుకు పైగా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన రణబీర్.. చివరకు అలియాతో ఫిక్స్ అయిపోయాడు. ఈ జంట లైఫ్ లాంగ్ సంతోషంగా కలిసి ఉండాలని ఆశిద్దాం.
Also Read:Acharya Sensor Review: ఆచార్య సెన్సార్ రివ్యూ
Recommended Videos: