Homeఎంటర్టైన్మెంట్Brahmastra First Review: 'బ్రహ్మాస్త్ర' మూవీ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది

Brahmastra First Review: ‘బ్రహ్మాస్త్ర’ మూవీ మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది

Brahmastra First Review: బాలీవుడ్ లో వరుసగా సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్న సమయం లో అక్కడి ట్రేడ్ వర్గాలకు సరికొత్త ఆశలను రేపిన చిత్రం బ్రహ్మాస్త్ర..రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు..అమితాబ్ బచ్చన్ మరియు అక్కినేని నాగార్జున వంటి వారు ప్రధాన పాత్రలు పోషించగా, నాగిని సీరియల్ లో హీరోయిన్ గా నటించిన మౌనీ రాయ్ ఇందులో మెయిన్ విలన్ గా నటించింది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనం గా ప్రారంభమయ్యాయి..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటి వరుకు ఈ సినిమాకి 14 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు సమాచారం..వచ్చిన గ్రాస్ మొత్తం లో 90 శాతం వరుకు 3D వెర్షన్ కి రావడం విశేషం..మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాకి తెలుగు వెర్షన్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..హైదరాబాద్ బుక్ మై షో లో బ్రహ్మాస్త్ర బుకింగ్స్ ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే షాక్ అవ్వక తప్పదు..ఇక్కడి స్టార్ హీరో రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమాకి జరుగుతున్నాయి.

Brahmastra First Review
Brahmastra Movie

తెలుగు లో ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం తో పాటు దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెలుగు లో సమర్పించడం..రణబీర్ మరియు అలియా భట్ లతో పాటుగా రాజమౌళి కూడా తరుచు ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనడం వల్ల ఈ సినిమాకి ఇక్కడ కూడా అద్భుతమైన బజ్ ఏర్పడింది..అయితే ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ స్క్రీనింగ్ ఇటీవలే దుబాయి లో కొంతమంది పాత్రికేయలకు మరియు సినీ ప్రముఖులకు ప్రదర్శించారు..ఈ స్పెషల్ స్క్రీనింగ్ నుండి వస్తున్నా టాక్ ఏమిటి అంటే, బాలీవుడ్ కి అత్యవసరం గా కావాల్సిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచేసినట్టే అని అంటున్నారు.

Also Read: Anchor Omkar Second Marriage: ప్రముఖ స్టార్ హీరోయిన్ తో రెండవ పెళ్ళికి సిద్దమైన యాంకర్ ఓంకార్..?

Brahmastra First Review
ranbir kapoor

రణబీర్ కపూర్ మరియు అలియా భట్ అద్భుతంగా నటించారని..ముఖ్యంగా 3D అనుభవం అయితే అద్భుతంగా ఉందని..థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ కి గురి అవుతారని..ఈ సినిమాలో ఉన్నటువంటి VFX ఎఫెక్ట్స్ ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ సినిమాకి కూడా లేదని చెప్పుకొస్తున్నారు..మీడియా టాక్ అయితే అద్భుతంగా వచ్చింది..కానీ ఇదే టాక్ పబ్లిక్ నుండి కూడా వస్తుందో లేదో తెలియాలంటే ఎల్లుండి వరుకు ఆగాల్సిందే.

Also Read:Prabhas Salaar: ప్రభాస్ పై ప్రశాంత్ నీల్ తీవ్రమైన అసహనం.. సలార్ షూటింగ్ ఆగిపోనుందా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version