
ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి రెట్టించిన ఉత్సాహం తో ఇపుడు సినిమాలు ఒప్పుకోవడం జరుగుతోంది. `సైరా ` చిత్రం తరవాత కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య ” చిత్రంలో నటిస్తున్న మెగా స్టార్ ఆ తరవాత చేయబోయే చిత్రాలను కూడా వరుసలో పెట్టడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ సమయంలో టైం వేస్ట్ చేయకుండా కధలను వింటూ దర్శకులను ఎన్నిక చేసుకొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటున్నాడు ఆ క్రమంలో ఇప్పుడు ముగ్గురు యువ దర్శకులు రాబోయే చిరంజీవి చిత్రాలకు దర్శకత్వం వహించ బోతున్నారు,
డిసెంబర్ చివరి వరకు వర్క్ ఫ్రం హోం..!
అలా చిరంజీవి సినిమాకి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నవాళ్లలో మొదటి దర్శకుడు సాహో ఫేమ్ సుజిత్ . కాగా ఈ దర్శకుడు చిరంజీవి నటించ బోయే `లూసిఫెర్ ` రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి అవకాశం దక్కించు కొనడం జరిగింది ఇక ఈ దర్శకుడి తరవాత చిరంజీవి చిత్రానికి డైరెక్ట్ చేసే ఛాన్స్ యువ దర్శకులు అయిన మెహెర్ రమేష్ ( బిల్లా ఫేమ్ ), కె .ఎస్ . రవీంద్ర అలియాస్ బాబీ ( వెంకీ మామ ఫేమ్ ) దక్కించు కొన్నారు .
ప్రజారవాణాలో మార్పులు చేర్పులు!
ఇక మెహెర్ రమేష్ చిరంజీవి తో చేయబోయే చిత్రం తమిళ ” వేదాళం ” రీమేక్ కాగా , బాబీ మాత్రం తాను వ్రాసుకొన్న స్టోరీ ని చిరంజీవికి వినిపించడం జరిగిందట ..కాగా ఈ కథ చిరంజీవికి నచ్చడం జరిగిందట గాని ఈ చిత్రంలో ఇంకో హీరో కి కూడా కీలక పాత్ర ఉందని తెలుస్తోంది .దాంతో ఎన్నో తర్జన భర్జనలు అనంతరం రానా దగ్గుబాటి ని సెకండ్ హీరోగా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి రానా దగ్గుబాటి కి కూడా చిరంజీవి తో కలిసి నటించాలని ఎప్పట్నుంచో కోరిక ఉందట …అదీగాక రానా , రామ్ చరణ్ లిద్దరూ చిన్ననాటి స్కూల్ మేట్స్ కావడం తో రానా నటించడం దాదాపు ఖాయమైంది అని అనుకోవచ్చు .