https://oktelugu.com/

Rana Naidu Season2: ‘రానా నాయుడు’ సీజన్ 2 టీజర్ వచ్చేసింది..ఈసారి మరింత బోల్డ్ డైలాగ్స్ తో అదరగొట్టేసిన వెంకీ!

ప్రస్తుతం సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఉన్నంత జోష్ లో మరో సీనియర్ హీరో లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సంక్రాంతికి ఆయన నుండి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : February 4, 2025 / 01:26 AM IST
    Follow us on

    Rana Naidu Season2: ప్రస్తుతం సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఉన్నంత జోష్ లో మరో సీనియర్ హీరో లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సంక్రాంతికి ఆయన నుండి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ 300 కోట్ల రూపాయిల గ్రాస్ కి అతి చేరువలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ బాషా చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఒక ఇండస్ట్రీ హిట్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత పెద్ద హిట్ తర్వాత వెంకటేష్ ఏ సినిమా చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ, ఆయన నుండి అతి త్వరలోనే ‘రానా నాయుడు’ సీజన్ 2 వెబ్ సిరీస్ రాబోతుంది అనేది నేడే తెలిసింది.

    ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదల చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వెంకటేష్, రానా లను ఇంత బోల్డ్ అడల్ట్ కంటెంట్ లో చూస్తామని అభిమానులు అసలు ఊహించలేకపోయారు. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్ల ఆయన నుండి బూతులు వచ్చేలోపు చూడలేకపోయారు కానీ, యూత్ ఆడియన్స్ మాత్రం ఎగబడి చూసారు. రెండవ సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడగా, నేడు విడుదల చేసిన టీజర్ ని చూసి ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. వెంకటేష్ ని మరింత వైల్డ్ గా ఈ రెండవ సీజన్ లో చూపించినట్టు అనిపించింది. ఇక రానా ని చూస్తే హాలీవుడ్ యాక్షన్ హీరోని చూస్తున్న ఫీల్ కలిగింది.

    మొదటి సీజన్ లో ఉన్న నటీనటులే రెండవ సీజన్ లోను ఉన్నారు కానీ, ఈ సీజన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కూడా తోడు అయ్యాడు. అర్జున్ రామ్ పాల్ తో వెంకటేష్, రానా దగ్గుబాటి చేసే పోరాటమే ఈ రెండవ సీజన్ లో చూపించినట్టు తెలుస్తుంది. ఒక భారీ బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీదున్న వెంకటేష్, ఈ వెబ్ సిరీస్ తో మరోసారి భారీ హిట్ కొట్టి యూత్ ఆడియన్స్ ఇంకా బాగా దగ్గరయ్యేలా ప్లాన్ చేసున్నాడు. అయితే ఈ టీజర్ కేవలం హిందీ లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్ కోసం కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. వెబ్ సిరీస్ మాత్రం ఏకకాలం లోనే అన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ టీజర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్, రానా ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు.