Rana Naidu Season 2 Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వల్ల కంటు ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత రెండు సంవత్సరాల క్రితం వెంకటేష్(Venkatesh), రాణా (Rana) కలిసి నటించిన ‘రానా నాయుడు’ (Rana Naidu) సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అయింది. అయితే మొదటి సీజన్ కొంత వరకు విమర్శలను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్ లాంటి నటుడి నుంచి అలాంటి బోల్డ్ డైలాగులు వినడం జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఆ సీజన్ అలా ముగిస్తే ఇప్పుడు రానా నాయుడు సీజన్ 2 రీసెంట్ గా ఓటిటి లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రానా ముంబైలో ఉండే సెలబ్రిటీస్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే తన కుటుంబానికి ఒక పెద్ద ప్రమాదం అయితే వచ్చి పడుతుంది. ఆ ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ తన కుటుంబానికి వచ్చే పెను ప్రమాదాన్ని ఎలా తప్పించాడు అనేది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ఈ సిరీస్ ని ఎగ్జైటింగ్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా రానా క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రతి ప్రాబ్లం ని సాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా డైనమిక్ క్యారెక్టర్ లో రానా అయితే కనిపించాడు. ముఖ్యంగా మొదటి సీజన్ లో బూతులు ఎక్కువ ఉన్నాయనే విమర్శలను ఎదుర్కొన్నప్పటికి ఈ సీజన్లో చాలా వరకు బూతులు అయితే తగ్గించారు. ఇక సినిమా కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా అయితే కనిపించారు. మొదటి రెండు ఎపిసోడ్లు సినిమా కథలో లీనమయ్యేలా చేస్తాయి అయితే మొదటి రెండు ఎపిసోడ్లు రానా నట విశ్వరూపాన్ని చూపిస్తాడు. దర్శకుడు సైతం ప్రేక్షకుడిని డివియెట్ అవ్వకుండా హుక్ చేసి పట్టుకున్నాడు. అయితే దర్శకుడు పర్ఫెక్ట్ ప్రణాళికతో మరి ఆ రెండు ఎపిసోడ్లను బాగా డిజైన్ చేసుకున్నాడు.
ఇక మూడో ఎపిసోడ్ నుంచి సినిమాలో బిట్స్ బిట్స్ గా మనకు నచ్చుతూ ఉంటాయి. అంతే తప్ప ఎపిసోడ్ మొత్తం అయితే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయదు. నాగ క్యారెక్టర్ లో నటించిన వెంకటేష్ (Venkatesh) కి కూడా సరైన క్యారెక్టర్ ను రాయాలేదనే చెప్పాలి. మొదటి సీజన్ లో బూతులతో ప్రేక్షకుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన వెంకటేష్ ఈ సీజన్ లో మాత్రం తన క్యారెక్టర్ కి ప్రాపర్ రైటింగ్ అయితే లేదని చెప్పాలి. ఇంకొంచెం అతన్ని కథలో ఇన్వాల్వ్ చేస్తూ ఇంకా డెప్త్ ను క్రియేట్ చేస్తూ క్యారెక్టర్జేషన్ ని ముందుకు తీసుకెళ్ళే స్కోప్ అయితే ఉంది. కానీ రచయితలు దర్శకుడు ఎందుకని వెంకటేష్ పాత్రని చాలా క్రిస్పీగా రాశారో అర్థం కాదు… ఇక రానా క్యారెక్టర్ అయితే అతనికి వచ్చిన ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ ప్రేక్షకుడిని ఒక థ్రిల్ ఫీల్ అయ్యేక రాశారు.
ఇక ఈ సినిమాలో మైనస్ ల గురించి చెప్పాలి అంటే మూడో ఎపిసోడ్ నుంచి మిగిలిన ఎపిసోడ్ లను చూడడం కొంతవరకు ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే మూడో ఎపిసోడ్ నుంచి కథ ఏమీ ఉండదు. కాబట్టి సైడ్ ట్రాక్ వెళ్లిపోయి ఏదో లాగించాలనే ఉద్దేశంతో ఎక్కువ లాగ్ చేస్తూ నడిపించారు. మూడోవ ఎపిసోడ్ నుంచి మిగిలిన ఎపిసోడ్స్ చూడాలంటే ప్రేక్షకుడికి విసుగు పడుతుందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రానా ఈ సిరీస్లో అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకు ఆయన పోషించిన పాత్రలు ఒకేత్తైతే ఈ సిరీస్ లో ఆయన నటన మరొకెత్తుగా నిలుస్తుంది…చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇస్తూనే ఎక్కడ సైడ్ ట్రాక్ వెళ్లకుండా తన పాత్ర పరిధిని తెలుసుకొని అందులో నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు. వెంకటేష్ పాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికి ఆయన కనిపించినంత సేపు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే ప్రయత్నం చేశాడు…అభిషేక్ సైతం తన పాత్రతో సినిమా మీద హైపును పెంచే ప్రయత్నం చేయడమే కాకుండా మధ్య మధ్యలో ఆయన క్యారెక్టర్ వల్లే సిరీస్ స్టేబుల్ గా వెళ్లిందనే చెప్పాలి…ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ అంత పెద్దగా ఎఫెక్టివ్ అనిపించనప్పటికి అక్కడక్కడ పర్లేదు అనేలా ఉంది. సిరీస్ లోని కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేయడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం అయితే లేదు… ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కొన్ని షాట్స్ చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచించి చేసినట్టుగా అనిపించింది. రొటీన్ షాట్స్ ని వాడుతూ రెగ్యూలర్ ఫార్మాట్లోనే చూపించే ప్రయత్నం అయితే చేశారు…
ప్లస్ పాయింట్స్
రానా యాక్టింగ్
ఫస్ట్ రెండు ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
మ్యూజిక్
లాగ్ సీన్స్
రేటింగ్
ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2/5
