Rana Last Movie: నేటి తరం కుర్ర హీరోలలో కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రలోనైనా నటించడానికి ముందు ఉండే హీరో దగ్గుపాటి రానా..లీడర్ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ యువ హీరో ఆ తర్వాత హీరోగా పలు సక్సెస్ లు అందుకొని బాహుబలి సిరీస్ తో విలన్ గా పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తాని చాటాడు..ఇక ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో ఆయనకీ సరిసమానంగా ఢీకొట్టే పాత్రలో నటించి కెరీర్ లో మరో మలుపు తిప్పే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన సాయి పల్లవి తో కలిసి చేసిన విరాట పర్వం సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యింది..అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదట ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అని అనిపించుకుంది.

Also Read: F3 Closing Collections: F3 క్లోసింగ్ కలెక్షన్లు.. దిల్ రాజుకు భారీ నష్టాలు
అయితే రానా కి సోషల్ మీడియా లో ఆయన అభిమానుల నుండి ఇటీవల కాలం లో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడింది..హాలీవుడ్ రేంజ్ కటౌట్..అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మాస్ సినిమాలు చెయ్యకుండా ఎప్పుడు ఏడుపుగొడ్డు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అంటూ రానా ని టాగ్ చేసి బాగా తిడుతున్నారు..బాహుబలి లాంటి సెన్సషనల్ హిట్ సినిమా తర్వాత వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకి వెళ్లుంటే ఈపాటికి స్టార్ హీరో రేంజ్ లో ఉండేవాడివి అని అభిమానులు సోషల్ మీడియా లో తమ ఆవేదనని వ్యక్తపరుస్తున్నారు..బాహుబలి సినిమా తో వచ్చిన ఫేమ్ ని సరిగా ఉపయోగించుకోలేదని..కనీసం భీమ్లా నాయక్ సినిమా తర్వాత వచ్చిన ఫేమ్ తోనైనా ఇక నుండి జాగ్రత్తగా సినిమాలు చేస్తూ కమర్షియల్ గా ఎదగాలని రానా కి అభిమానులు సోషల్ మీడియా లో సలహాలు ఇస్తున్నారు..అభిమానుల ఆవేదనని అర్థం చేసుకున్న రానా ‘ఇక నుండి ప్రయోగాత్మక సినిమాలు చెయ్యను..మీరు కోరుకునే మాస్ సినిమాలే చేస్తాను’ అంటూ అభిమానులకు విరాట పర్వం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాటిచ్చాడు..ఇక నుండి ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.

Also Read: Heroes Who Left Software Jobs: సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు వదిలి సినిమాల్లోకి వచ్చిన హీరోలు వీళ్ళే
Recommended Videos:
[…] […]
[…] […]