Rana Daggubati : పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు దగ్గుబాటి రానా(Daggubati Rana). బాహుబలి తర్వాత రానా రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళిపోతుంది. పెద్ద మాస్ హీరో అయిపోతాడని అందరూ అనుకున్నారు కానీ, ఆ సినిమా తర్వాత ఆయన సినిమాలు చేయడమే బాగా తగ్గించేసాడు. కథ నచ్చితే హీరో గా చేస్తాడు, క్యారక్టర్ రోల్స్ కూడా చేస్తాడు కానీ, అవి కూడా చాలా సెలెక్టెడ్ గా వెళ్తున్నాడు. బాహుబలి తర్వాత రానా చేసిన సినిమాలు ఏంటంటే ‘నేనే రాజు..నేనే మంత్రి’, ‘అరణ్య’, ‘విరాట పర్వం’, ‘భీమ్లా నాయక్’,’వెట్టియాన్’. వీటిల్లో కేవలం ‘భీమ్లా నాయక్’, ‘నేనే రాజు..నేనే మంత్రి’ సినిమాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే రానా కేవలం హీరో గా మాత్రమే కాదు నిర్మాతగా, హోస్ట్ గా కూడా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
రానా కేవలం సినిమాల్లోనే కాదు, వ్యాపారాల్లో కూడా తనదైన బ్రాండ్ మార్క్ ని చూపిస్తున్నాడు. ఈయనకు దేశవ్యాప్తంగా అనేక ఫుడ్ రెస్టారెంట్స్ , బార్స్, కాఫీ షాప్స్ ఉన్నాయి. రీసెంట్ గానే ఆయన తన భార్య తో కలిసి హైదరాబాద్ లో ఒక ఫుడ్ కోర్టు ని ఏర్పాటు చేసాడు. డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) సతీసమేతంగా వచ్చి ఈ ఫుడ్ కోర్ట్ ని ప్రారంభించాడు. అయితే ఇందులో ఐటమ్స్ కొనాలంటే కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే సాధ్యం. సామాన్యులు ఆ ఫుడ్ కోర్టు దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ కేజీ టమాటా ఎంతో తెలుసా..? అక్షరాలా 4250 రూపాయిలు. ఒక్క కొబ్బరి బొండం విలువ వెయ్యి రూపాయిలు. ఒక గ్లాస్ చెరుకు రసం విలువ 250 రూపాయిలు అట. సామాన్య మనుషులు కొనేలాగా ఉన్నాయా ఇవి. బయట కిలో టమాటా 5 రూపాయిల నుండి 20 వరకు ఉంటుంది.
కొబ్బరి బొండం విలువ పది రూపాయిలు, చెరుకు రసం విలువ 15 రూపాయిల రేంజ్ లో ఉంటుంది. బయటకి, రానా ఫుడ్ కోర్టు కి మధ్య ఎందుకు ఇంత వ్యత్యాసం అంటే, రానా తెప్పించిన ఈ కూరగాయలు విదేశాల నుండి ఎగుమతి అయినవి. అక్కడి నుండి ఆయన అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ ఫుడ్ ని కలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినేందుకు ఎన్ని వేల రూపాయిలను ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటోళ్ళు ఎక్కువగా ఈ ఫుడ్ కోర్టు ని ఆశ్రయిస్తారు. ముఖ్యంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులూ, వ్యాపార వేత్తలు షాపింగ్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ ఫుడ్ కోర్టు. సామాన్యులు కూడా షాపింగ్ చేయొచ్చు కానీ, వెళ్ళేటపుడు తమతో పాటు ఒక 30 వేల రూపాయిల క్యాష్ ని కూడా తీసుకెళ్తే మంచిది.