Kayadu Lohar: ఈమధ్య కాలం లో స్టార్ హీరోయిన్స్ కంటే కొత్తగా వచ్చే హీరోయిన్స్ యూత్ ఆడియన్స్ ని అమితంగా ఆకర్షిస్తున్నారు. వీళ్లకు చాలా తొందరగా స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్ వస్తుండడం గమనార్హం. లాక్ డౌన్ తర్వాత కొత్త హీరోయిన్స్ హవా నే ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. మిగిలిన ఇండస్ట్రీస్ లో సంగతి కాసేపు పక్కన పెడితే, మన తెలుగు లో మాత్రం కొత్త హీరోయిన్స్ దే రాజ్యం. గడిచిన ఐదేళ్ళలో శ్రీలీల, కృతి శెట్టి, భాగ్యశ్రీ భోర్సే, మీనాక్షి చౌదరి ఇలా ఇంత మంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీ లోకి దూసుకొచ్చి తమ సత్తా చాటారు. తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా, పూజా హెగ్డే వీళ్ళందరూ కూడా కొత్త హీరోయిన్స్ గాలిలో కొట్టుకుపోయారు. ఇప్పుడు రీసెంట్ గా మరో యంగ్ హీరోయిన్ యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె పేరు కాయాదు లోహార్(Kayadhu Lohar).
రీసెంట్ గా విడుదలైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon) అనే చిత్రం ద్వారా ఈమె మన ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం లోని ఆమె అందం, క్యూట్ నటన ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఆమెని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసేసింది అని చెప్పొచ్చు. ఈ చిత్రానికి ముందు ఆమె తెలుగు లో శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘అల్లూరి’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత మరాఠీ, మలయాళం, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన డ్రాగన్ చిత్రం మాత్రం ఆమె కెరీర్ ని ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆమె వరుసగా ఆరు తెలుగు సినిమాలకు సంతకాలు చేసిందట. అందులో విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫంకీ’ అనే చిత్రం కూడా ఉంది.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) కాయాదు లోహర్ ఫోన్ తీసుకొని చూడగా, ఆమెకి ఆమెనే సొంతంగా తనపై మీమ్స్ చేసుకొని, సోషల్ మీడియా లో టాప్ మోస్ట్ మేము ఛానెల్స్ కి పంపిస్తుందట. అందులో ఒక మీమ్ ‘ కాయాదు లోహర్ టాలీవుడ్ లో కాబోయే స్టార్ హీరోయిన్’ అని ఉందట. ఆమెకు ఆమెనే ఆ మీమ్ క్రియేట్ చేసుకొని ఉండొచ్చేమో కానీ, రీసెంట్ స్టార్ డైరెక్టర్స్ అందరూ ఈమె వైపు చూస్తున్నారంటే కచ్చితంగా ఆమె కోరిక త్వరలోనే నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మీనాక్షి చౌదరీ, భాగ్యశ్రీ భోర్సే మేనియా నడుస్తుంది. వీళ్ళ జాబితాలోకి కాయాదు లోహర్ కూడా వెళ్లిపోయిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.