Bigg Boss 9 Telugu Ramu Rathod: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టాస్కులు ఎంత అద్భుతంగా సాగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇప్పటి వరకు ప్రసంసరమైన బిగ్ బాస్ సీజన్స్ ఒక ఎత్తు, ఈ సీజన్ మరో ఎత్తు అని చెప్పాలి. సామాన్యులు గా అగ్నిపరీక్ష షో ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్, అదే విధంగా సెలబ్రిటీలుగా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్, పోటాపోటీగా అద్భుతంగా ఆడుతూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కులు వేరే లెవెల్ లో ఉన్నాయి అని చెప్పొచ్చు. ఈ టాస్కుల ద్వారా ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరీ బాగా హైలైట్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఇమ్మానుయేల్ జోడి, గత సీజన్ లో నిఖిల్,పృథ్వీ జోడికంటే డేంజరస్ అని చెప్పొచ్చు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ ఈ కాంబినేషన్ డామినేట్ చేసి అవతల పారేసింది.
కానీ చివరికి మహేష్ రాథోడ్ కెప్టెన్ అయ్యాడు. మహేష్ కూడా అద్భుతంగా ఆడాడు, తనవైపు నుండి నూటికి నూరు శాతం ఎఫోర్ట్స్ పెట్టాడు కానీ, ఓవరాల్ గా చూసుకుంటే పైన చెప్పిన ఆ ముగ్గురు ప్రాణం పెట్టి ఆడేసారు అని చెప్పొచ్చు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే ఒక బల్ల ఉంటుంది, రెండు బాక్సులు ఉంటాయి. నాలుగు టీమ్స్ లో రెండు టీమ్స్ కి సంబంధించిన వారిలో ఒక్కొక్కరు వచ్చి ఆ బల్లని తమకు కేటాయించిన బాక్స్ లో పెట్టాలి. అలా ఎవరైతే ముందు పెడుతారో వాళ్ళు ఈ టాస్క్ లో గెలిచినట్టు. ఒకవేళ ఇద్దరు పెట్టలేకపోతే, వీళ్ళ కోసం సపోర్టుగా ఒకరు వచ్చి, పోడియం వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్ స్టేజి పై డ్యాన్స్ చేస్తూ ఉండాలి. వీళ్ళు టాస్కుని పూర్తి చేసేంత వరకు సపోర్ట్ గా వచ్చినవాళ్లు డ్యాన్స్ వెయ్యాలి.
అలా చివరి వరకు ఆపకుండా డ్యాన్స్ వేసిన వాళ్లకు ఒకరిని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించే అవకాశం ఉంటుంది. భరణి వంతు వచ్చినప్పుడు మహేష్ రాథోడ్, రీతూ చౌదరీ ఉంటారు. భరణి మహేష్ కి సపోర్ట్ చేస్తాడు, మహేష్ ఇంటికి కెప్టెన్ అవుతాడు. కెప్టెన్ అయ్యాక ఈ కుర్రాడి ఆనందం చూస్తే చాలా ముచ్చటేస్తాది. నేను ఈ ఇంటికి కెప్టెన్ అయ్యానా?, నమ్మలేకపోతున్నాను అంటూ సంబరాలు చేసుకుంటాడు మహేష్ రాథోడ్. అయితే ఇది జరిగే ముందు భరణి ని తనూజ వచ్చి రీతూ కి సపోర్ట్ చేయమని బ్రతిమిలాడుతుంది, అప్పుడు భరణి నేను మహేష్ కి సపోర్ట్ చేస్తానని రాత్రి మాట ఇచ్చాను, రీతూ కి కచ్చితంగా రాబోయే రోజుల్లో నా నుండి సహాయం అందుతుంది అంటూ చెప్పుకొచ్చాడు భరణి. ఈ కారణం చేత వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి గ్యాప్ ఏర్పడింది.