Bigg Boss 9 Telugu Ritu Chowdhury: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లో ఒకరు పవన్ కళ్యాణ్. ఇతని అగ్నిపరీక్ష షో లో అద్భుతంగా ఆడడంతో మొదటి నుండి ఈయనపై అంచనాలు ఆడియన్స్ లో భారీ రేంజ్ లో ఉండేవి. కానీ మొదటి మూడు వారాలు ఇతని నుండి ఎలాంటి కంటెంట్ రాలేదు. అదే సమయం లో బిగ్ బాస్ కి ఎదో టైం పాస్ చేయడం కోసం వచ్చినట్టు అనిపించింది. అందుకే ఆడియన్స్ సపోర్ట్ పూర్తిగా తొలగిపోయి గత వారం డేంజర్ జోన్ లోకి వచ్చాడు. ఇక తన ఆటు తీరు మార్చుకోకపోతే ఈసారి ఎలిమినేట్ అవ్వడం పక్కా అనే విషయం అర్థమై ఈ వారం ఆయన తన విశ్వరూపం చూపించడం మొదలు పెట్టాడు.
కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మానుయేల్ తో జత కలిపి, వరుసగా టాస్కులు గెలుస్తూ శభాష్ అనిపించుకున్నాడు. ఇది కదా కళ్యాణ్ లో ఇన్ని రోజులు మేము చూడాలని అనుకున్నది అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. అయితే పాపం అతను పడిన కష్టానికి ఫలితం లేకుండా పోయింది. స్నేహితులు అనుకున్న రీతూ చౌదరీ,డిమోన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచి కెప్టెన్సీ టాస్క్ నుండి తొలగించారు. దీంతో పాపం కళ్యాణ్ మనసు బాగా నొచ్చుకుంది. వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ప్రోమో ని కూడా కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో లో డిమోన్ పవన్ కి ఒకరిని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించే అవకాశం బిగ్ బాస్ ఇవ్వడం తో, అతను పవన్ కళ్యాణ్ ని తొలగించాడు. ఆ తర్వాత అతనికి రీతూ చౌదరీ డిమోన్ పవన్ కి పవన్ కళ్యాణ్ ని తొలగించమని చెప్పిందని, అందుకే అతను తొలగించాడనే విషయం తెలుస్తుంది.
ఈ విషయం పవన్ కళ్యాణ్ కి తెలుసు అనే విషయాన్నీ తెలుసుకున్న రీతూ చౌదరీ అతని వద్దకు వెళ్లి చేతులు పట్టుకొని క్షమాపణలు చెప్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ చెయ్యి తియ్యి అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత విడుదల చేసిన రెండవ ప్రోమో లో రీతూ చౌదరీ పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్తూ చాలాసేపు బ్రతిమిలాడుతుంది. కానీ పవన్ ఒప్పుకోడు, నువ్వు నన్ను మోసం చేసావని ఒకసారి అంటాడు, అవతలోడి కష్టాన్ని దోచుకోకండి అని మరోసారి అంటాడు. అతని బాధలో నిజంగానే అర్థం ఉంది. మూడు రోజులపాటు శరీరాన్ని హూనం చేసుకొని ఆడాడు. ఫలితంగా చివరికి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అతనికి అన్యాయం అయితే జరిగింది కానీ, ఆడియన్స్ మనసులను గెలుచుకోవడం లో మాత్రం న్యాయమే జరిగిందని చెప్పాలి. ఈ ఒక్క ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ టైటిల్ రేస్ లోకి వచ్చినట్టే.