Homeఎంటర్టైన్మెంట్పిల్లల కోసం రామ్ అనూహ్య నిర్ణయం.. ఆనందంలో సునీత !

పిల్లల కోసం రామ్ అనూహ్య నిర్ణయం.. ఆనందంలో సునీత !

Sunitha and Ram
సింగర్ సునీత తన మనసుకు నచ్చిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం భర్తతో హాయిగా ఉంది సునీత. ఇక పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారి డౌట్స్ కు క్లారిటీ ఇస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈమె భర్త రామ్ వీరపనేని గురించి కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. కోట్లాది వ్యాపారాలు ఉన్న ఈయన పెళ్లి తర్వాత తన బిజినెస్ విషయంలో కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నాడట. ఈయన మంచి బిజినెస్ మ్యాన్. ఇండస్ట్రీలో ఈయనకు కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. మ్యాంగో రామ్ అంటారు ఈయన్ని.

Also Read: ‘ఉప్పెన’ విరుచుకుపడుతుందా?

కాగా సునీత పిల్లలకి కూడా తన ఆస్తుల్లో వాటా ఇవ్వాలని రామ్ వీరపనేని నిర్ణయించుకున్నాడట. పైగా సునీత ఇద్దరు పిల్లలను తన వ్యాపారాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి రామ్ వీరపనేని తన జీవితంలో రావడం తన అదృష్టం అని సునీత అభిప్రాయ పడుతున్నది నిజమే. ఇక రామ్ సూరపనేని ఒక డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్.. ఒక విధంగా డిజిటల్ మీడియాలో మొఘల్ లాంటి వాడు. అందుకే ఆయనకు ఆస్తులు కూడా బాగా ఉన్నాయి.

కాగా రామ్ వీరపనేని పర్సనల్ జీవితం పై అందరూ కనబరుస్తున్నారు. ఆయనకు గతంలో పెళ్లి అయిందా ? అయితే పిల్లలు ఉన్నారా ? ఇలాంటి విషయాల పై అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా రామ్ కి గతంలో పెళ్లి అయిందని, కాకపోతే పిల్లలు లేరని తెలుస్తోంది. ఇక ఆయన మే 26, 1974న జన్మించారు. అంటే ఆయన వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. ఇక సునీత వయసు 42 ఏళ్ళు. ఈ ఇద్దరి మధ్య కేవలం ఐదేళ్లు మాత్రమే గ్యాప్ ఉండటం, ఇద్దరూ ఒంటరిగానే ఉండటంతో మొత్తానికి పెళ్లి వైపు అడుగులు వేశారు. ఇక రామకృష్ట వీరపనేని ఆస్ట్రేలియాలో చదువుకుని ఇండియాకు వచ్చి వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.

Also Read: ఉప్పెన క్లైమాక్స్ లీక్.. ఇదేనట?

సునీత పిల్లల విషయంలో రామ్ వీరపనేని తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా సునీతకు పిల్లలు అంటే ఎంత ప్రేమ అనేది ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. వాళ్ల కోసమే తాను ఉన్నానని చెప్పేది సునీత. అలాంటి పిల్లల అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకుంది సునీత. రామ్, పిల్లల మధ్య ఉన్న బంధం విషయంలో కూడా తాను చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది ఈమె.

ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు సునీత షాక్ అవ్వడమే కాదు.. కన్నీరు కూడా పెట్టుకుంటుందని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. అంతగా ఏం చేసాడబ్బా అనుకోవచ్చు కానీ ఎమోషనల్‌గా సునీతను కదిలిస్తున్నాడు రామ్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular