https://oktelugu.com/

అదరగొడుతున్న రామ్ ‘రెడ్’ బిజినెస్

పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో రామ్ మార్కెట్ అగ్రహీరోల రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ మూవీ చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘రెడ్’ వస్తుండటంతో ఈ మూవీ విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్ చేస్తుంది. ఆంధ్రలో ‘రెడ్’ మూవీ థియేటర్‌ రైట్స్‌ రూ.11 కోట్లకు అమ్ముడుపోగా, సీడెడ్‌లో రూ.4 కోట్లకు కొన్నారని సమాచారం. దర్శకుడు […]

Written By: , Updated On : March 12, 2020 / 12:49 PM IST
Follow us on

పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో రామ్ మార్కెట్ అగ్రహీరోల రేంజ్లో పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ ‘రెడ్’ మూవీ చేస్తున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ‘రెడ్’ వస్తుండటంతో ఈ మూవీ విడుదలకు ముందే అదిరిపోయే బిజినెస్ చేస్తుంది.

ఆంధ్రలో ‘రెడ్’ మూవీ థియేటర్‌ రైట్స్‌ రూ.11 కోట్లకు అమ్ముడుపోగా, సీడెడ్‌లో రూ.4 కోట్లకు కొన్నారని సమాచారం. దర్శకుడు కిశోర్‌తో రామ్‌ చేసిన ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాలతోపాటు ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు ‘రెడ్’ బిజినెస్ కు దోహదపడ్డాయి. శ్రీ స్రవంతి మూవీస్‌ బ్యానర్లో ‘స్రవంతి’ రవికిషోర్‌ ‘రెడ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. హెబ్బా పటేల్ ఓ ఐటమ్ సాంగ్లో నటిస్తుంది. ఇటీవలే ఇటలీలోని అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించారు. మణిశర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 9న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది. రిలీజ్ కు ముందే అదిరిపోయే బిజినెస్ చేసిన ‘రెడ్’ రిలీజ్ అయ్యాక ఈమేరకు కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాల్సిందే.