Rashmi Gautam- Ramprasad: రష్మీ గౌతమ్ పరిచయం అవసరం లేని పేరు. హీరోయిన్ గా స్థిరపడాలనే ఆశ తో వచ్చిన రష్మీకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో జబర్దస్త్ షో తో యాంకర్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు లైఫ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. బుల్లితెర మీద బిజీయెస్ట్ యాంకర్ గా మారడమే కాకుండా ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. సినిమాల్లో అవకాశాలు వచ్చిన కానీ తన మొదటి ప్రియారిటి బుల్లితెర అని చెప్పే రష్మీ, ప్రస్తుతం పలు టీవీ షో ల్లో నటిస్తుంది.
ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుందంటే దానికి కారణం రష్మీ అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి షో లో తాజాగా రష్మికి చేదు అనుభవం ఎదురైంది. డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతున్న హైపర్ ఆదికి తోడుగా తాజాగా ఆటో రాంప్రసాద్ వచ్చి చేరాడు. తాజాగా తన స్కిట్ లో భాగంగా రష్మి ని ఏకంగా “రాత్రికి వస్తావా” అంటూ డబల్ మీనింగ్ తో మాట్లాడాడు, దీంతో రష్మీ నన్ను ఎందుకు రమంటున్నావు అంటూ అడిగేసరికి, రాత్రికి ఎందుకు రమంటారో తెలియదు అంటూ ఎదురు సమాధానం ఇచ్చాడు.
దీంతో రష్మీ తో సహా సెట్ లోని అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఇంద్రజ ఏయ్ అనేసరికి వెంటనే తేరుకున్న రాంప్రసాద్ ఊరిలో జాతర ఉంది అందుకే పిలిచానంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేయడంతో ఇది మరింత హైలెట్ అయ్యింది. మొదటి నుంచి కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. కంటెంట్ తక్కువ డబల్ మీనింగ్ ఎక్కువ అనే టాక్ ఉంది.
కానీ ఈటీవీ లో టెలికాస్ట్ అవుతున్న షో ల్లో శ్రీదేవి డ్రామా కంపెనీకే కొంచెం చెప్పుకోదగిన రేటింగ్స్ వస్తున్నాయి. అందుకే కాబోలు షో యూనిట్ కూడా వాటినే కొనసాగిస్తున్నారు. అయితే ఈటీవీ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఏదో రేటింగ్స్ కోసం దిగజారిపోయి తమ స్థాయిని తగ్గించుకునే ప్రయత్నాన్ని ఈటీవీ మానుకుంటే మంచిది. లేకపోతే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ కోల్పోవడం ఖాయమనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.