Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ ఒక సెన్సేషన్, ఆయన ఏది మాట్లాడినా.. అది సెన్సేష్, వర్మ ఏ పని చేసినా అది వివాదం, ఇక ప్రతీ విషయంలో తనదైన మార్క్‌లో స్పిందించే వర్మ.. ఓ కార్యక్రమంలో తన గురించి కూడా.. తన మార్క్‌లో స్పందించారు.

శివ, క్షణక్షణం, సత్య, , దెయ్యం లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్‌వర్మ, కంప్లీట్‌గా మారిపోయారు. ఇప్పుడు తీస్తున్న సినిమాలకు ఒకప్పుడు వర్మ తీసిన సినిమాలకు ఏమాత్రం పొంతన లేదు. అయితే ఈ విషయం గురించి వర్మను ప్రశ్నించగా.. ఆ డైరెక్టర్ ఎప్పుడో చచ్చిపోయాడని అన్నారు. ప్రతీ సినిమా తర్వాత తాను మారిపోతానని చెబుతున్నారు. ఇక తన సినిమా కథల గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు వర్మ. తన మెదడులో తట్టిన ఆలోచనల్నే కథలుగా మలుస్తానని అంటున్నారు. రీసెంట్‌గా ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు వర్మ. ఇందులో అందరూఆశ్చర్య పోయే కామెంట్స్ చేశారు వర్మ. ఎవరైనా తనను చంపడానికి వస్తే తాను పారిపోనని చెప్పారు. వచ్చిన వ్యక్తి తనను కత్తితో పొడిస్తే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆస్వాదించి చచ్చిపోతానని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న అందరూ.. ఆశ్చర్య పోయారు.
Also Read: NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?
-ఆ మూడు వదిలేయాలి..
తనలాగా బతకాలంటే మాత్రం ఓ మూడు విషయాలను అలవరచుకోవాలన్నారు. దేవుడు, సమాజం, కుటుంబం ఈమూడు వియాలు వదిలిపెట్టాలని పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. అప్పుడు వారికి వచ్చే స్వేచ్ఛతో తన లాగా హాయిగా బతకవచ్చని వర్మ తెలిపారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, కశ్మీర్ ఫైల్స్ సినిమాలు తనకు బాగా నచ్చాయన్నారు.
-నా హక్కు నాకు తెలుసు..
దేశ పౌరుడిగా రాజ్యాంగంలో తనకున్న హక్కులేమిటో తనకు బాగా తెలుసని అన్నారు వర్మ. వాటినే తాను వాడుకుంటానని అన్నారు. ఎదుటి వాళ్లు బాధపడతారని మాట్లాడకుండా ఉంటే అసలు ఏం మాట్లాడలేమన్నారు. టికెట్ల ధరల పెంపు విషయంలో కేవలం ప్రజలకు మధ్యవర్తిగానే మంత్రిని కలిశానని పేర్కొన్నారు. మనం చెప్పిన నిర్ణయం కొందరికి నచ్చుతుందని, ఇంకొందరికి నచ్చదని అన్నారు.
-బుద్ధున్నోళ్లెవరూ నాకు ఓటెయ్యరు…
తాను రాజకీయాల్లోకి వస్తే.. ముఖ్యమంత్రి అయితే.. ఎలా ఉంటుంది అని ప్రశ్న ఎదురయ్యింది రాముకి. అయితే తాను ఎన్నికల్లో నిలబడినా బుద్ధి ఉన్నోళ్లెవరూ తనకు ఓటెయ్యరన్నారు. తాను జనాల కోసం ఏమీ చేయనన్న విషయం వారికి బాగా తెలుసని చెప్పారు. తన కోసం తాను బతుకుతున్నానని, రాజకీయ నాయకుల లక్షణం అది కాదని చెప్పారు. తనను ముఖ్యమంత్రిని చేస్తూ.. ఏం చేయాలో తెలియక డబ్బు తీసుకుని విదేశాలకు వెళ్లిపోతాను అన్నారు
Also Read: Balakrishna: బాలయ్య అప్పట్లో ఎంత కట్నం డిమాండ్ చేశారో తెలుసా ?
[…] Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంట… […]
[…] Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంట… […]
[…] Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంట… […]
[…] Also Read: Ram Gopal Varma : నా లైఫ్ నా ఇష్టం.. నాలా బతకాలంట… […]