
IMDB Rankings Ram Charan : #RRR సినిమాతో మన తెలుగు సినిమాకి దక్కిన ఖ్యాతిని మనం ఎప్పటికీ మరచిపోలేము.కలలోనైనా మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంటుందా అని అనుకుంటున్నా సమయం లో దర్శకధీరుడు రాజమౌళి అనితర సాధ్యం అనుకుంటున్న ఈ పనిని సాధించి చూపి మన తెలుగు వాళ్ళందరూ గర్వం తో కాలర్ ఎగురవేసేలా చేసాడు.
ఇక ఈ ‘నాటు నాటు’ పాటకి తమ అద్భుతమైన స్టెప్పులతో ప్రపంచం మొత్తాన్ని ఆడించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా గ్లోబల్ స్టార్ స్టేటస్ దక్కింది కానీ, ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ ఎక్కువ పాపులారిటీ ని సంపాదించాడని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అందుకు ఉదాహరణే లేటెస్ట్ గా IMDB విడుదల చేసిన టాప్ 30 ఇండియన్ సెలెబ్రిటీల లిస్ట్.ఇందులో రామ్ చరణ్ మూడవ స్థానం లో కొనసాగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ కి కనీసం టాప్ 30 లో 16 వ స్థానం దక్కింది.
ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.మొదటి స్థానం సతీష్ కౌశిక్ నిలవగా, రెండవ స్థానం లో షారుఖ్ ఖాన్, మూడవ స్థానం లో రామ్ చరణ్ నిలిచారు.ఇక నాల్గవ స్థానం లో యంగ్ బ్యూటీ రాశి ఖన్నా నిలిచింది.రీసెంట్ గానే ఈమె అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అయినా ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్లే ఆమె IMDB టాప్ ర్యాంకింగ్స్ లోకి వచ్చింది.
ఆమె తర్వాత ఐదవ స్థానం లో దీపికా పడుకొనే, ఆరవ స్థానం లో సిమ్రాన్, 7 వ స్థానం లో సమంత, 8 వ స్థానం లో శ్రద్ధా కపూర్, 9 వ స్థానం లో ఐశ్వర్య రాయి బచ్చన్ మరియు పడవ స్థానం లో అనుపమ్ ఖేర్ నిలిచారు.అయితే రీసెంట్ గానే గ్లోబల్ వైడ్ ఫేమస్ సంపాదించిన ఇద్దరు హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ కి కనీసం టాప్ 20 లో కూడా చోటు దక్కకపోవడం విశేషం.