Ram Charan- Instagram: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ప్యాన్ ఇండియా హీరో అయిపోయాడు మన రాంచరణ్. ఏకంగా హిందీ హీరోలతో సమాన స్తాయికి ఎదిగాడు. రాంచరణ్ సినిమాలు ఇప్పుడు తెలుగు నాటే కాదు.. హిందీలోనూ ఆడుతాయి. ‘అల్లూరి సీతారామరాజు’గా ఆయన చూపించిన అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

ఇన్నాళ్లు తెలుగు వరకే పరిమితమైన రాంచరణ్ క్రేజ్ ‘ఆర్ఆర్ఆర్’ దేశవ్యాప్తం.. చెప్పాలంటే విశ్వవ్యాప్తం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రాంచరణ్ కు ఆస్థాయిలోనే ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ లో ఆదరణ దక్కుతోంది.
తాజాగా రాంచరణ్ ఇన్ స్టాగ్రామ్ లో రికార్డులు బద్దలు కొట్టాడు. ఇన్ స్టాలో అడుగుపెట్టిన తర్వాత అతి తక్కువ కాలంలో 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా నిలిచాడు. ఇదంతా ‘ఆర్ఆర్ఆర్’ సంపాదించుకున్న క్రేజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు ఎక్కువగా రాంచరణ్ ను ఫాలో అవ్వడంతో ఈ రికార్డు మైలురాయికి చేరుకున్నారు.

ఆర్ఆర్ఆర్ తో అమాంతం పెరిగిన రాంచరణ్ క్రేజ్ ఇప్పుడు దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్ మూవీతో మరో మెట్టు ఎక్కనున్నారు. శంకర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీ రిలీజ్ అయితే చరణ్ రేంజ్ మరింత పైకి వెళుతుందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.