Ramayana Teaser Review: రామాయణం ని సరిగ్గా వెండితెర మీద ఆవిష్కరిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే జరుగుతాయి. పాత సినిమాల్లో రామాయణం ని అద్భుతంగా చూపించారు. ఆ తర్వాత టీవీ సీరియల్స్ లో ఎన్నో వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. కానీ సినిమాలు మాత్రం ఎందుకో ఆ స్టాండర్డ్ ని అందుకోలేకపోతున్నాయి. ప్రభాస్(Rebal Star Prabhas) ‘ఆదిపురుష్'(Adipurush) చిత్రం పై అప్పట్లో బోలెడన్ని ఆశలు ఉండేవి. కానీ ఆ సినిమా విడుదల తర్వాత ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎన్నో వివాదాలకు కూడా దారి తీసింది. ఈ సినిమా అనుకున్న విధంగా పర్ఫెక్ట్ గా తీసి ఉండుంటే 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది. కానీ మిస్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు రామాయణం మీద ‘దంగల్’ చిత్ర దర్శకుడు నితీష్ తివారి(Nithish Tiwari) రణబీర్ కపూర్(Ranbir Kapoor) తో మరో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: కూలీ మూవీ కోసం మాస్టర్ ప్లాన్ వేసిన లోకేష్ కనకరాజ్…
నేడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో అయితే రాలేదు. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురిడిగా ‘యాష్’ మరియు సీతగా సాయి పల్లవి నటించారు. రాముడిగా రణబీర్ కపూర్ లుక్స్ అదిరిపోయాయి. సీతగా సాయి పల్లవి లుక్స్ కూడా బాగున్నాయి. కానీ రావణుడిగా నటించిన యాష్ లుక్స్ ని మాత్రం క్లారిటీ గా రివీల్ చేయలేదు మూవీ టీం. ఇది యాష్ అభిమానుల్లో కాస్త అసంతృప్తి ని రగిలే లా చేసింది. అంతే కాదు, ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ వర్క్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. రణబీర్ కపూర్ గత చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని VFX వర్క్ ఎలా ఉండేదో, అలా ఉన్నట్టుగా అనిపించింది. సినిమా పూర్తి అయ్యింది మొన్ననే కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ పై ఇంకా శ్రద్ద పెట్టినట్టుగా అనిపించలేదు.
Also Read: అందాల ఆరబోతలో దిట్ట ఈ బొమ్మ. చూస్తే ఫిదా అవాల్సిందే
వచ్చే ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్టు. నేటి తరం మాత్రమే కాదు, రాబోయే తరాలు కూడా తెలుసుకునే విధంగా రామాయణం మీద ఒక అద్భుతమైన సినిమా ఉండాలి. అది ఈ చిత్రమే అవుతుందని ఆశిద్దాం. శ్రీరాముడి గొప్పతనం, సీత దేవి సహనం, రావణాసురిడి అహంకారం గురించి నేటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పాలి. రామాయణం మన జీవితంలో మంచి మార్గం లో నడవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి టీజర్ లో లాగా కాకుండా, సినిమా ఫైనల్ ఔట్పుట్ అద్భుతంగా ఉండాలని ఆశిద్దాం. రామాయణం టీజర్ ని క్రింద అందిస్తున్నాము చూడండి. చూసి ఆదిపురుష్ టీజర్ బాగుందా?, లేకపోతే రామాయణం టీజర్ బాగుందా అనేది కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
