Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ముంబయిలో కలిశారు. ప్రస్తుతం ఈ విషయంపై ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు వీరిద్దరు కలవడానికి కారణం ఏంటి, అనే విషయంపై అటు టాలీవుడ్, బాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో రాజమౌళి ఫుల్ బిజీగా ఉన్నారు. జనవరి 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనుల్లో ముంబైలో అడుగుపెట్టారు రాజమౌళి. కాగా, తాజాగా, సల్మాన్ సినిమా సెట్స్‌లో రాజమౌళి కలవగా.. వీరిద్దరు గంటకు పైగా చర్చించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అసలు ఏం జరిగిందనే విషయంపై అందరి దృష్టి పడింది.
ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిందిగా సల్మాన్‌ను రాజమౌళి కోరినట్లు ఓ వార్త వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ముంబయిలో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలోనే ముంబయిలో భారీగా ప్రమోషన్స్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో ప్రమోషన్ చేయిస్తే.. సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.